సోషల్ మీడియాను షేక్ చేస్తున్న హాట్ బ్యూటీ.. 51 ఏళ్ల వయసులో షాకింగ్ నిర్ణయం

ఒకప్పుడు తెలుగు చిత్రపరిశ్రమలో ఆమె తోపు హీరోయిన్. ఫస్ట్ మూవీతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. కానీ ఆమెకు తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ఇప్పుడు 51 ఏళ్ల వయసులో గ్లామర్ ఫోటోలతో నెట్టింట గత్తరలేపుతుంది. తాజాగా ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంది.

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న హాట్ బ్యూటీ.. 51 ఏళ్ల వయసులో షాకింగ్ నిర్ణయం
Actress

Updated on: Aug 09, 2026 | 12:46 PM

చిత్రపరిశ్రమలో నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదు. అలాగే హీరోయిన్ గా రాణించడం అంటే అంత సులభం కాదు ఒకానొక సమయంలో బిజీగా గడిపిన హీరోయిన్స్ కూడా ఇప్పుడు సినిమాలు లేక అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారు. చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. పెళ్లి చేసుకోని సెటిల్ అవుతుంటే మరికొంతమంది  కొంతమంది సినిమాలతో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఆ లిస్ట్ లో ముందు వరసలో ఉంటుంది ఈ బ్యూటీ. అడపాదడపా సినిమాలు చూస్తూనే అభిమానులను ఆకట్టుకుంటుంది. ఆమె ఏజ్ ఇప్పుడు 51 ఏళ్లు.. ఈ వయసులోనూ తరగని అందంతో కవ్విస్తుంది. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తుంది. అలాగే ఈ ఏజ్ లో ఆమె ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆమె మరెవరో కాదు.

బాలీవుడ్ హాట్ బ్యూటీ అమీషా పటేల్. గదర్‌ 2 సినిమా తర్వాత మరోసారి హాట్ టాపిక్ అయ్యింది బీటౌన్‌ హాట్ బ్యూటీ అమిషా పటేల్‌. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబులాంటి బడా హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది. బద్రి, నాని లాంటి సినిమాలతో టాలీవుడ్ ఆడియన్స్‌కు కూడా దగ్గరైన ఈ బ్యూటీ ఆతర్వాత బాలీవుడ్ పైనే ఎక్కువ ఫోకస్ చేసింది. అక్కడ వరుసగా సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. గదర్‌ 2 సినిమాతో హీరో సన్నిడియోల్‌తో పాటు హీరోయిన్‌ అమిషా పటేల్‌ కూడా బౌన్స్ బ్యాక్ అయ్యారు. చాలా రోజులుగా వెండితెరకు దూరంగా ఉన్న అమిషా, సోషల్ మీడియాలో మాత్రం యమా యాక్టివ్‌గా ఉంటూ వస్తున్నారు. వరుసగా ఈవెంట్స్‌లో పార్టిసిపేట్ చేస్తూ ఆ అప్‌డేట్స్‌ను ఫాలోవర్స్‌లో షేర్ చేసుకుంటుంది.

రీసెంట్‌ టైమ్సలో అమిషా సోషల్ మీడియా యాక్టివిటీ టాప్‌లో ట్రెండ్ అయ్యింది. ముఖ్యంగా అమ్మడి గ్లామర్‌ షో హాట్ టాపిక్ అయ్యింది. ఈ రేంజ్‌లో గ్లామర్ ఇమేజ్‌ ఉన్న ఈ బ్యూటీ వెండితెర మీద మాత్రం బోల్డ్ సీన్స్ విషయంలో స్ట్రిక్ట్ కండిషన్స్ పెడుతుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది. అదే పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉండాలని. అవును ఇండస్ట్రీలో చాలా మంది పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉంటున్నారు. అమీషా కూడా ఇక పై పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉండాలని నిర్ణయించుకుందని బీ టౌన్ లో టాక్ వినిపిస్తుంది. కాగా ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో ఒకటి రెండు సినిమాలే ఉన్నాయి. కానీ సోషల్ మీడియాలో ఈ అమ్మడు తన అందాలతో కనువిందు చేస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us