
టాలీవుడ్ సీనియర్ నటి సుభాషిణి గురించి పరిచయం అక్కర్లేదు. అల్లరి సుభాషిణి అల్లరి సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఒకప్పుడు అనేక హిట్ చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి నటిగా, హాస్యనటిగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే చాలా కాలంగా ఆమె సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉండగానే క్యాన్సర్ బారిన పడిన ఆమె.. ఇప్పుడిప్పుడే కోలుకున్నారు. ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తన కెరీర్ హైలైట్స్ గురించి పంచుకున్నారు. ఆమె కెరీర్లో అత్యధికంగా అందుకున్న పారితోషికం గురించి మాట్లాడుతూ, ఒక సినిమాకు రోజుకు రూ. 50,000 సంపాదించినట్లు వెల్లడించారు. తనకు ఒక రోజు షూటింగ్‌కు రూ. 50,000 పారితోషికం ఇచ్చారని తెలిపారు. ఆమె మహిళా మండలి ప్రెసిడెంట్ పాత్రలో నటించిన ఒక చిత్రంలో ఈ పారితోషికం అందుకున్నట్లు గుర్తుచేసుకున్నారు. ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రంలో మాస్ హీరో రవితేజతో కలిసి తాను నటించినట్లు పేర్కొన్నారు.
ఎక్కువ మంది చదివినవి : KS Chitra : తెలుగులో పెద్ద హీరోయిన్.. ఆమెకు పాట పాడితే నా గొంతుకు 2 రోజులు రెస్ట్ ఇచ్చేదాన్ని.. చిత్ర..
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధించిందని, ఆ చిత్రానికి శ్రీను వైట్ల స్వయంగా తనకు రూ. 50,000 ఇచ్చి పంపించారని సుభాషిణి వివరించారు. ఒక రోజుకే అంత పెద్ద మొత్తాన్ని సంపాదించే స్థాయికి తాను చేరుకున్నానని, అది తన కెరీర్లో ఎంతో సంతృప్తినిచ్చిన అనుభవమని ఆమె తెలిపారు. ఈ సంఘటన ఆమె నటనా ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఒక్క పాట కోసం 365 రోజులు థియేటర్లు షేక్ అయ్యాయి.. అప్పట్లో టాప్ లేపేసిన సాంగ్..
అలాగే అల్లరి సినిమా గురించి మాట్లాడుతూ.. అల్లరి సినిమాలో తాను మొత్తం నైటీలోనే నటించాల్సి వచ్చిందని ఆమె వెల్లడించారు. తాను అనుకోకుండా పరుచూరి గోపాలకృష్ణ గారి చింతామణి నాటకంలో రవీంద్ర భారతిలో నటిస్తున్న సమయంలో, అక్కడి నుంచే నేరుగా సినిమా షూటింగ్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆమె నైటీలోనే ఉన్నారని, ఇంటికి వెళ్లి డ్రెస్సులు మార్చుకుంటానని చెప్పారట. అయితే, సినిమా దర్శకుడు ఆమెను ఆశ్చర్యపరిచే నిర్ణయం తీసుకున్నారు. “మీరు సినిమా మొత్తం నైటీతోటే ఉంటారు. నైటీలోనే చేస్తావండి” అని ఆయన చెప్పినట్లు సుభాషిణి గుర్తు చేసుకున్నారు. ఈ సంఘటన అల్లరి సుభాషిణి సినీ జీవితంలో ఒక మరపురాని జ్ఞాపకంగా నిలిచిపోయింది. ఒక నాటకం నుండి నేరుగా సినిమా సెట్‌కు వచ్చి, అనుకోకుండా ఒకే రకమైన దుస్తులతో సినిమా మొత్తం పూర్తి చేయడం అనేది అరుదైన అనుభవం. ఈ ప్రత్యేక పాత్ర ఆమెకు ఎంతో గుర్తింపు తెచ్చింది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : 1965లోనే లక్షలతో తీసిన బాలనాగమ్మ సినిమా.. షూటింగ్ పూర్తైన ఎందుకు రిలీజ్ కాలేదంటే..
ఎక్కువ మంది చదివినవి : Cinema : మెంటలెక్కించే ట్విస్టులు.. క్లైమాక్స్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. ఓటీటీని షేక్ చేస్తున్న 7 ఎపిసోడ్స్..