ఇదేం సినిమా పిచ్చిగా ఉంది.. ఎవరు చూస్తారు అన్నారు.. కానీ థియేటర్లలో 100 రోజులు హౌస్ ఫుల్.. నా జీవితాన్ని మలుపు తిప్పింది..

నటి ఆమని తన కెరీర్‌ మార్చిన తెలుగు సినిమా విజయం గురించి మాట్లాడారు. ఈ సినిమా విడుదల ముందు "ఏం ఆడుతుంది?" అని చాలామంది అనుమానించారని, తనకు కూడా భయం వేసిందని ఆమె తెలిపారు. అయితే, అనుకోకుండా ఆ చిత్రం వంద రోజులు ఆడి బ్లాక్‌బస్టర్‌గా నిలిచి తన కెరీర్‌ను మార్చివేసిందని, దీనిని అదృష్టంగా భావిస్తానని ఆమని పేర్కొన్నారు. ఇప్పటికీ ఆ సినిమాకు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉందన్నారు.

ఇదేం సినిమా పిచ్చిగా ఉంది.. ఎవరు చూస్తారు అన్నారు.. కానీ థియేటర్లలో 100 రోజులు హౌస్ ఫుల్.. నా జీవితాన్ని మలుపు తిప్పింది..
Aamani

Updated on: Jul 02, 2026 | 9:22 AM

టాలీవుడ్ హీరోయిన్ ఆమని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు కథానాయికగా అలరించిన ఆమె.. ఇప్పుడు సహయ నటిగా అలరిస్తుంది. సినిమాలు, సీరియల్స్ ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ లోనూ బిజీగా ఉంటుంది. ఇదిలా ఉంటే .. ఓ ఇంటర్వ్యూలో ఆమని మాట్లాడుతూ.. తన సినీ ప్రస్థానంలో `జంబలకిడిపంబ` చిత్రం అనుకోని విజయం తన కెరీర్‌కు ఎలా మలుపు అయ్యిందో వివరించారు. అదృష్టాన్ని (లక్) తాను చాలా నమ్ముతానని, కొన్నిసార్లు గొప్ప కథాబలం ఉన్న సినిమాలు కూడా ఆడని సందర్భాలుంటాయని అన్నారు. `జంబలకిడిపంబ` సినిమా చిత్రీకరణ దశలో, ఆ తర్వాత విడుదల ముందు పరిశ్రమలో పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదుర్కొన్నదని ఆమని గుర్తుచేసుకున్నారు. “ఈ సినిమా ఏం ఆడుతుంది? ఆడవాళ్లు మగవాళ్లుగా, మగవాళ్లు ఆడవాళ్లుగా మారడం అనేది పిచ్చిగా లేదా?” అని చాలామంది విమర్శించారని ఆమె తెలిపారు. సినిమా ప్రివ్యూలు చూసిన సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ సభ్యులు సైతం “ఏంటి ఈ సినిమా? అసలు ఎందుకని? ఇది పిచ్చిగా ఉంది” అని అన్నారని, ఈ విషయం తనను కలవరపరిచిందని ఆమని వెల్లడించారు. షూటింగ్ సమయంలో కూడా “ఈయన ఏం తీస్తున్నాడు? అసలు పిచ్చిగా ఉంది. ఎవరు చూస్తారు ఇది కూర్చుని?” అంటూ యూనిట్‌లోనూ గుసగుసలు వినిపించాయని ఆమె అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: ఆ హీరోలాంటి మనిషి ఇంకొకరు ఉండరు.. పద్మ శ్రీ వచ్చిందని తెలిసి ఏమన్నారంటే.. మురళి మోహన్..

ఆ సమయంలో తాను తీవ్ర ఆందోళన చెందానని, “తెలుగులో ఒక మంచి జీవితం ఉంటుంది అనుకున్నాను. కానీ ఈ సినిమా విజయం సాధించకపోతే నా పరిస్థితి ఏంటి? మళ్ళీ ఇక్కడ కూడా నన్ను పక్కన పెట్టేస్తారేమో” అని ఒంటరిగా కూర్చొని భయపడి ఆలోచించానని ఆమని పేర్కొన్నారు. ఆ చిత్రానికి ఈ.వీ.వీ. సత్యనారాయణ వంటి పెద్ద డైరెక్టర్ దర్శకత్వం వహించడం, నరేష్ వంటి నటుడు నటించినా, పరిశ్రమలో నెలకొన్న ప్రతికూల వాతావరణం తనకు ఎంతో మానసిక వేదనను కలిగించిందని ఆమె వివరించారు. అయితే, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ `జంబలకిడిపంబ` చిత్రం అఖండ విజయం సాధించింది. ఆ రోజుల్లో 100 రోజులు ఆడటం అనేది ఒక పెద్ద విషయం, ఒక విప్లవం లాంటిదని ఆమని తెలిపారు. ఈ చిత్రం అన్ని కేంద్రాలలో వంద రోజులు ఆడి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిందని, అప్పట్లో అది పెద్ద రికార్డు అని ఆమె అన్నారు. ఇప్పటికీ ఈ సినిమా చూసినా బోర్ కొట్టదని, ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని ఆమె అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Arundhati Movie: అరుంధతి సినిమాను రిజెక్ట్ చేసి తప్పు చేశాను.. అతడు మాటలు విని వదిలేశా.. టాలీవుడ్ హీరోయిన్..

ఈ విజయం తన కెరీర్‌ను పూర్తిగా మార్చివేసిందని, అక్కడి నుంచే తన సినీ జీవితం మలుపు తిరిగిందని ఆమని పేర్కొన్నారు. కొన్నిసార్లు “బాగుంటుంది” అనుకున్న సినిమాలు ఆడకుండా పోతాయని, “ఏం ఆడుతుంది ఈ సినిమా?” అని అపనమ్మకం వ్యక్తం చేసిన చిత్రాలు పెద్ద హిట్‌ అవుతాయని ఆమె అన్నారు. ఈ అనుభవం తనకు అదృష్టం పట్ల నమ్మకాన్ని పెంచిందని, ఆ విజయం దేవుడి దయగా భావిస్తానని ఆమని చెప్పుకొచ్చారు.

ఎక్కువ మంది చదివినవి :  Sunil: ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే.. నా గుండెను తాకింది.. సునీల్ కామెంట్స్..

ఎక్కువ మంది చదివినవి : Tollywood: ఇంట్లోకి వెళ్లగానే సావిత్రిగారిని అలా చూసి ఏడ్చేశా.. మనిషి చిన్నగా అయిపోయి.. టాలీవుడ్ నటి కామెంట్స్..

Follow Us