Chiranjeevi: చిరంజీవిని అలా పిలవడం ఇష్టం లేక.. మెగాస్టార్ బ్లాక్ బస్టర్ మూవీని రిజెక్ట్ చేసిన ఆమని

సీనియర్ నటి ఆమని టాలీవుడ్ స్టార్ హీరోలందరితోనూ నటించింది. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు, జగపతి బాబు.. ఇలా ఎందరో స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. కానీ మెగాస్టార్ చిరంజీవితో మాత్రం ఒక్క సినిమా కూడా చేయలేదు.. దీనికి కారణమేమిటంటే..

Chiranjeevi: చిరంజీవిని అలా పిలవడం ఇష్టం లేక.. మెగాస్టార్ బ్లాక్ బస్టర్ మూవీని రిజెక్ట్ చేసిన ఆమని
Aamani, Chiranjeevi

Updated on: Apr 29, 2026 | 6:16 PM

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగింది ఆమని. స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ భాషలలో కూడా సినిమాలు చేసి మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే చాలా మంది లాగే పెళ్లి, పిల్లల తర్వాత సినిమా ఇండస్ట్రీకి కాస్త గ్యాప్ ఇచ్చింది. అయితే మళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ షురూ చేసిన ఈ అందాల తార సహాయక నటిగా రాణిస్తోంది. స్టార్ హీరోలు, హీరోయిన్లకు అక్కగా, అమ్మగా, అత్తగా నటిస్తోంది. అలాగే వెబ్ సిరీస్ లు, బుల్లితెర సీరియల్స్ కూడా చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది. కాగా లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ అందాల తార తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇదే క్రమంలో మెగాస్టార్ చిరంజీవి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

‘నా చిన్నప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి అంటే చాలా ఇష్టం. ఆయన సినిమాలు బాగా చూసేదాన్ని. మెగాస్టార్ నా డ్రీమ్ హీరో. రాధ, విజయశాంతి వాళ్లు చిరు పక్కన నటిస్తుంటే చూశాను. వాళ్లలాగే నేనూ ఏదో ఒక రోజు చిరు పక్కన నటిస్తానని అనుకున్నా. నేను కోరుకున్నట్లు గానే రిక్షావోడు సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. ఆ మూవీలో సౌందర్య కూడా ఉండడంతో మరింత హ్యాపీగా ఫీలయ్యాను. కానీ కొన్ని రోజుల తర్వాత పేపర్లో ఆ సినిమాలో నా ప్లేస్ లో నగ్మా పేరు చూసి షాక్ అయ్యా. వెంటనే నా మేనేజర్ ను పిలిచి అడిగా. డైరెక్టర్ మారిపోయారని, అందుకే హీరోయిన్ ను కూడా మార్చేశారని చెప్పాడు. అప్పుడు చాలా బాధపడ్డా’ అని ఆమని పేర్కొంది

ఇవి కూడా చదవండి

 

అయితే చిరంజీవితో కలిసి సినిమా చేసే ఛాన్స్ ఆమనికి మళ్లీ వచ్చింది. కానీ ఈ సారి ఆమనినే నో చెప్పింది. ఎందుకంటే స్టాలిన్ సినిమాలో చిరంజీవి అక్క క్యారెక్టర్ కోసం ఆమనిని సంప్రదించారట. తన డ్రీమ్ హీరో పక్కన సిస్టర్ గా చేయలేనని, చిరంజీవిని తమ్మడు అని పిలవలేనని స్టాలిన్ సినిమాను వదులుకున్నానని ఆమని తెలిపింది. ప్రస్తుతం ఈ సినీయర్ నటి కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. కాగా బ్లాక్ బస్టర్ గా నిలిచిన స్టాలిన్ సినిమాలో చిరంజీవికి అక్కగా ఖుష్బూ నటించిన సంగతి తెలిసిందే.

ఆమని కామెంట్స్.. వీడియో ఇదిగో..<

/h3>
 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us