Yash : టాక్సిక్ సినిమాలో అలాంటి సీన్స్.. ఆ విషయంలో ఆడవారి ఆలోచన వేరే.. డైరెక్టర్ పై యశ్ ప్రశంసలు..

ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో టాక్సిక్ ఒకటి. కన్నడ రాక్ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ పీరియడ్ యాక్షన్ సినిమా ఇప్పటికే ఈ ఏడాది ఆరంభంలోనే ధురంధర్ 2తో పోటీగా విడుదల కావాల్సిన ఉండగా.. అనుహ్యంగా వాయిదా పడింది. ఇప్పుడు జూన్ 4న ఈ సినిమా రిలీజ్ కానుంది.

Yash : టాక్సిక్ సినిమాలో అలాంటి సీన్స్.. ఆ విషయంలో ఆడవారి ఆలోచన వేరే.. డైరెక్టర్ పై యశ్ ప్రశంసలు..
Yash, Geetu Mohandas

Updated on: Apr 25, 2026 | 2:59 PM

కన్నడ రాక్ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ సినిమా టాక్సిక్. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కేవలం ఒక భారీ యాక్షన్ డ్రామాగా ఈ మూవీపై మరింత అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో సరికొత్త సంచనానికి తెరలేపారు. ముఖ్యంగా ఈ సినిమా టీజర్ విడుదలైన తర్వాత ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యింది. ఈ చిన్న టీజర్ ఇండియాలో పెను సంచలనమే సృష్టించింది. నిజానికి ఈ సినిమా ఈ ఏడాది ఆరంభంలోనే ‘ధురందర్ 2’తో పోటీగా విడుదల కావాల్సి ఉండగా, ఇప్పుడు జూన్ 4వ తేదీకి వాయిదా పడింది. విడుదల తేదీ దగ్గర పడుతున్న తరుణంలో, యష్ ఇటీవల తన దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ గురించి మాట్లాడిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

ఎక్కువమంది చదివినవి : Srikanth-Ooha : ఏంటీ.. ఆ స్టార్ నటుడు ఊహ మేనమామనా..? 100 సార్లు ఉత్తమ నటుడు.. తెలుగు వారికి సుపరిచితమే..

టీజర్ విడుదలైన తర్వాత ఈ సినిమా ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యింది. ముఖ్యంగా ఈ టీజర్ లోని పలు సన్నివేశాలు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అంతేకాదు ఈ చిత్రాన్ని లేడీ డైరెక్టర్ తెరకెక్కించడం పై ఇప్పటికీ చర్చనీయాంశంగా మారింది. ‘మూతోన్’, ‘లయర్స్ డైస్’ వంటి చిత్రాలతో పేరుగాంచిన గీతూ, ‘కేజీఎఫ్’తో పాన్-ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకున్న యశ్‌తో పోలిస్తే చాలా భిన్నమైన సినీ నేపథ్యం నుండి వచ్చారు. టాక్సిక్’ గ్యాంగ్‌స్టర్ ప్రపంచానికి ఆమె ఏమి తీసుకువస్తారనే దానిపై యశ్ స్పందించారు. ఇటీవలే అమెరికాలో జరిగిన ఓ పాడ్ కాస్ట్ లో యశ్ మాట్లాడుతూ.. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ టేకింగ్ పై ప్రశంసలు కురిపించారు.

ఎక్కువమంది చదివినవి : Monalisa : మోనాలిసా ప్రేమకథలో మరో భారీ ట్విస్ట్.. అప్పట్లో కుంభమేళా సుందరి.. ఇప్పుడు గర్భిణి!

సాధారణంగా యాక్షన్ చిత్రాల గురించి మాట్లాడినప్పుడు, అవి కేవలం పురుష దర్శకులకే పరిమితం అనేది ఇండియాలో ఉన్న చరిత్ర. ఇప్పటివరకు చాలా మంది అలాంటి చిత్రాలే తీశారు. కానీ ఇప్పుడు ఇది గ్యాంగ్ స్టర్ సినిమా. అది కూడా భారీ యాక్షన్ డ్రామా. యాక్షన్ సినిమాలు కేవలం పురుష దర్శకులు మాత్రమే తీస్తారనే ముద్రను గీతూ మోహన్ దాస్ చెరిపేశారు. రొమాన్స్ లేదా శృంగరాన్ని ఒక మహిళా దర్శకురాలు చూసే విధానం చాలా పవర్ ఫుల్ గా, భిన్నంగా ఉంటుంది. ఆమె సన్నివేశాలను మలిచే తీరులో ఒక రకమైన క్లాసిక్ టచ్, నిజాయితీ కనిపిస్తాయి అని చెప్పుకొచ్చారు యశ్.

ఈ ఏడాది ఆరంభంలో ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచి ఇప్పటికే చర్చకు దారితీసిన సినిమాలోని సీన్స్ గురించి యశ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. “ఆమె ఆలోచనలు చాలా స్పష్టంగా ఉంటాయి, తను చేసే ప్రతి పనిలోనూ ఆమెకు బలమైన నమ్మకం ఉంటుంది. అంతేకాదు, ఆమె ఒక అద్భుతమైన రచయిత్రి. నేను ఆమె నుంచి చాలా నేర్చుకున్నాను. కోరికల స్థాయిని, కొన్ని భావోద్వేగాలను, శృంగారాన్ని లేదా శృంగారాన్ని ఒక స్త్రీ ఎలా చూపించగలదో, ఒక మహిళ ఎలా ప్రదర్శించగలదో అనేది పూర్తిగా భిన్నంగా ఉంటుందని ఈ ప్రయాణంలో నేను గ్రహించాను.” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం యశ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

ఎక్కువమంది చదివినవి : Aamani : వయసు 52 సంవత్సరాలు.. 365 రోజులు ఇదే తింటాను.. నా ఫిట్నెస్ సీక్రెట్ ఇదే.. ఆమని కామెంట్స్..

Follow Us