Varun Tej: వరుణ్ తేజ్‌కు గాయం.. అపోలో ఆసుపత్రిలో సర్జరీ..

టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ మంగళవారం ఫుట్‌బాల్ ఆడుతున్న సమయంలో గాయపడ్డారు. రోజు ఆయనకు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో స్వల్ప శస్త్రచికిత్స (minor surgery) నిర్వహించారు. కొద్దిరోజుల పాటు బరి సినిమా షూటింగ్ కి విరామం ఇవ్వనున్నారు. బరి చిత్రాన్ని ఆయన చెల్లెలు నిహారిక కొణిదెల నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది.

Varun Tej: వరుణ్ తేజ్‌కు గాయం.. అపోలో ఆసుపత్రిలో సర్జరీ..
Varun Tej

Updated on: Apr 15, 2026 | 12:54 PM

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చాలా కాలంగా సరైన హిట్టు కోసం వెయిట్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా ‘బరి’ అనే హై-వోల్టేజ్ యాక్షన్ చిత్రం కోసం ఆయన ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నారు. యాక్షన్ సన్నివేశాల కోసం రిహార్సల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం ఫుట్ బాల్ ఆడుతున్న సమయంలో ఆయన కాలికి తీవ్రమైన గాయం అయ్యింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి చిన్నపాటి శస్త్రచికిత్స అవసరమని సూచించారు. ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో సర్జరీ విజయవంతంగా పూర్తయ్యిందని, ఆయన కోలుకుంటున్నారని చిత్ర బృందం వెల్లడించింది.

ఎక్కువ మంది చదివినవి : JD Chakravarthy: మీ కోసమే అంటూ ప్రేమగా 8 నెలలు స్లో పాయిజన్ ఇచ్చింది.. డాక్టర్ మాటలు విని షాకయ్యా.. జేడీ చక్రవర్తి

వైద్యులు వరుణ్ తేజ్‌కు కనీసం కొన్ని వారాల పాటు పూర్తి విశ్రాంతి అవసరమని సూచించారు. దీనివల్ల ‘బరి’ చిత్ర షూటింగ్ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాతే తిరిగి సెట్స్‌లో అడుగుపెట్టనున్నారు. వరుణ్ తేజ్ తన పాత్రల కోసం శారీరకంగా చాలా కష్టపడుతుంటారని, ఈ క్రమంలోనే ఈ గాయం జరిగిందని సన్నిహిత వర్గాలు తెలిపాయి.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత అంతటి క్రేజ్.. కానీ.. ఆ ఒక్క అలవాటుతో బలైన టాలీవుడ్ అందగాడు..

వరుణ్ తేజ్‌కు సర్జరీ జరిగిందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మెగా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ ‘గెట్ వెల్ సూన్’ హ్యాష్‌ట్యాగ్‌లతో సందేశాలు పోస్ట్ చేస్తున్నారు. వరుణ్ తేజ్ తన ఆరోగ్య పరిస్థితిపై త్వరలోనే అధికారికంగా స్పందించే అవకాశం ఉంది.

ఎక్కువ మంది చదివినవి :  Monalisa Bhosle: మోనాలిసా మిస్సింగ్.. సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ఫర్మాన్ ఖాన్..

ఎక్కువ మంది చదివినవి : Prasad Behara : విరాజితతో సిరీస్ ఆపేయడానికి కారణం ఇదే.. అసలు విషయం చెప్పిన ప్రసాద్ బెహరా..

Loading...
Unable to load recommendations.
Follow Us