Vijay: హృదయ విదారకమైన ఘటన ఇది.. కల్తీసారా బాధితులను పరామర్శించిన దళపతి విజయ్..

ఎంతో మంది బాధితులు చావు బతుకుల మధ్య ఆస్పత్రుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. కుటుంబాల ఆక్రందన అరణ్యరోదనను  తలపిస్తోంది. సారా మాఫియా నిర్వాకంతో  తమిళనాడు  కళ్లకురిచ్చి జిల్లా కరుణాపురం ఇప్పుడు మరుభూమిగా మారింది.  నిషా కోసం సారా తాగిన వాళ్లు   తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.  ఒకరో ఇద్దరో కాదు ఏకంగా  150 మంది ఆసుపత్రుల పాలయ్యారు. ఇంత దారుణానికి కారణం.. కెమికల్‌ సారా.. 

Vijay: హృదయ విదారకమైన ఘటన ఇది.. కల్తీసారా బాధితులను పరామర్శించిన దళపతి విజయ్..
Thalapathy Vijay
Follow us

|

Updated on: Jun 21, 2024 | 6:44 PM

ఎటు చూడూ విచలిత దృశ్యాలు ..ఎవర్నీ కదిలించినా కన్నీటి సుడులే..  జనం పిట్టల్లా రాలారు.. మర్యాద కోసమో..మత్తు కోసమో.. కష్టం మరవడం కోసమో సారా తాగిన సామాన్యులు కల్తీ కాటుకు సమిథలయ్యారు. తమిళనాడును కుదిపేస్తోన్న కల్తీసారా ఘటనలో 50మందికి పైగా చనిపోయారు. డెత్‌టోల్‌ అంతకంతకు పెరుగుతోంది . ఎంతో మంది బాధితులు చావు బతుకుల మధ్య ఆస్పత్రుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. కుటుంబాల ఆక్రందన అరణ్యరోదనను  తలపిస్తోంది. సారా మాఫియా నిర్వాకంతో  తమిళనాడు  కళ్లకురిచ్చి జిల్లా కరుణాపురం ఇప్పుడు మరుభూమిగా మారింది.  నిషా కోసం సారా తాగిన వాళ్లు   తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.  ఒకరో ఇద్దరో కాదు ఏకంగా  150 మంది ఆసుపత్రుల పాలయ్యారు. ఇంత దారుణానికి కారణం.. కెమికల్‌ సారా..

కల్తీసారా ఘటన తమిళనాడులో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పది లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఐతే బాధిత కుటుంబ సభ్యాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాయి విపక్షాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు సిద్దమయ్యాయి. కల్తీ మద్యం తాగి మరణించిన వారి కుటుంబాలకు తమిళనాడు ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది. పలువురు ప్రముఖులు బాధితులను పరామర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే దళపతి విజయ్ కూడా బాధితులను పరామర్శించారు.

కల్తీ మద్యం బాధితులను, వారి కుటుంబాలను స్వయంగా కలుసుకుని ఓదార్చారు విజయ్. ఇందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్ తమిళనాడు ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో, “కల్లకురిచ్చి జిల్లా కరుణాపురం ప్రాంతంలో నకిలీ మద్యం సేవించి 50 మందికి పైగా మరణించారనే వార్త దిగ్భ్రాంతికరమైనది. హృదయ విదారకమైనది. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని, చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఆతర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని విజయ్ కలుసుకుని వారికి అందుతున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
అమెరికాలో ఉద్యోగాల కొరత.! ఉద్యోగాలు దొరక్క తెలుగు వారికి కష్టాలు.
అమెరికాలో ఉద్యోగాల కొరత.! ఉద్యోగాలు దొరక్క తెలుగు వారికి కష్టాలు.
సరోగసీ ద్వారా తల్లైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి.. ప్రసూతి సెలవులు.
సరోగసీ ద్వారా తల్లైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి.. ప్రసూతి సెలవులు.
భావప్రకటన స్వేచ్ఛాహక్కును ఈ ఉత్తర్వు చాటిచెప్పింది- NBF
భావప్రకటన స్వేచ్ఛాహక్కును ఈ ఉత్తర్వు చాటిచెప్పింది- NBF
TV9, మరో 3 ఛానెళ్ల ప్రసారాలు పునరుద్ధరించాలంటూ 15 మంది MSOలకు..
TV9, మరో 3 ఛానెళ్ల ప్రసారాలు పునరుద్ధరించాలంటూ 15 మంది MSOలకు..
స‌ముద్రంలోకి కార్లతో డ్రైవింగ్.. రీల్స్ పిచ్చితో ఇరుక్కున్న యువ‌త
స‌ముద్రంలోకి కార్లతో డ్రైవింగ్.. రీల్స్ పిచ్చితో ఇరుక్కున్న యువ‌త
పొట్టచుట్టూ కొవ్వు పేరుకుపోయిందా.? ఇలా చేస్తే ఇట్టే కరిగిపోతుంది.
పొట్టచుట్టూ కొవ్వు పేరుకుపోయిందా.? ఇలా చేస్తే ఇట్టే కరిగిపోతుంది.
గాయాలతో బాధపడుతున్నా బాధితుడిని కనికరించని ఇజ్రాయెల్‌ సైన్యం..
గాయాలతో బాధపడుతున్నా బాధితుడిని కనికరించని ఇజ్రాయెల్‌ సైన్యం..
ఖాళీ కడుపుతో ఇది తినండి.. మార్పు మీరే గమనించండి.!
ఖాళీ కడుపుతో ఇది తినండి.. మార్పు మీరే గమనించండి.!
తగ్గనున్న రైల్వే ప్లాట్‌ఫారం టిక్కెట్‌ ధర.. ఆర్థిక మంత్రి ప్రకటన.
తగ్గనున్న రైల్వే ప్లాట్‌ఫారం టిక్కెట్‌ ధర.. ఆర్థిక మంత్రి ప్రకటన.
వర్షాకాలంలో గొడుగు పట్టుకోవడం ఇబ్బందిగా ఉందా.. ఇది మీ కోసమే.!
వర్షాకాలంలో గొడుగు పట్టుకోవడం ఇబ్బందిగా ఉందా.. ఇది మీ కోసమే.!