'కల్కి' తర్వాత రిలీజయ్యే ప్రభాస్ మూవీ ఇదే

TV9 Telugu

27 June 2024

సలార్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన మరో పాన్ ఇండియా మూవీ కల్కి 2898 ఏడీ

నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మైథాలజీ కమ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది.

కాగా సలార్ పార్ట్ 1, కల్కి 2898 ఏడీ సినిమాలు కేవలం ఆరు నెలల గ్యాప్ లోనే రిలీజ్ కావడం అభిమానులకు ఆనందాన్నిస్తోంది.

‘కల్కి’ బ్లాక్ బస్టర హిట్ కావడంతో ప్రభాస్‌ నుంచి వచ్చే తర్వాతి సినిమా ఏంటా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ క్రమంలో ప్రభాస్‌ నుంచి వచ్చే సినిమా కచ్చితంగా ‘రాజా సాబ్‌’  అని తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ కీలక షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకుంది.

మరోవైపు సలార్ పార్ట్ 2 మరింతగా ఆలస్యమయ్యే ఛాన్స్ ఉంది. మొదటి పార్ట్ సూపర్ హిట్ కావడంతో రెండో భాగం కోసం ప్రశాంత్ నీల్ సమయం తీసుకోనున్నారు.

అలాగే సందీప్‌ వంగా ‘స్పిరిట్‌’ మూవీ ఇంకా అసలు పట్టాలెక్కలేదు. కాబట్టి నెక్ట్స్ థియేటర్లలో రిలీజయ్యేది ‘రాజా సాబ్' నే.

మారుతి తెరకెక్కిస్తోన్న ఈ రొమాంటిక్ థ్రిల్లర్ జానర్ సినిమాలో నిధి అగర్వాల్‌, మాళవిక మోహనన్‌, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.