ఈ ఫొటోలో ఉన్న చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా..? ఇప్పుడు ఎక్కడ చూసినా ఆయన పేరే వినిపిస్తుంది

పైన కనిపిస్తున్న పిల్లలో ఓ టాలెంటడ్ డైరెక్టర్ ఉన్నాడు. చేసింది తక్కువ సినిమాలే అయినా బాక్సాఫీస్ కింగ్ అయ్యాడు. ఇప్పుడు ఎక్కడ చూసిన ఆయన పేరే వినిపిస్తుంది. ఆయనతో సినిమాలు చేయడానికి ఇప్పుడు స్టార్ హీరోలు క్యూ కడుతున్నారు. ఇంతకు ఆ దర్శకుడు ఎవరో గుర్తుపట్టారా.? పెద్ద కష్టమేమో కాకపోవచ్చు.. ఆమె ఇప్పుడు పాన్ ఇండియా దర్శకుడు. తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు పైకెక్కించిన డైరెక్టర్.

ఈ ఫొటోలో ఉన్న చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా..? ఇప్పుడు ఎక్కడ చూసినా ఆయన పేరే వినిపిస్తుంది
Tollywood
Follow us

|

Updated on: Jun 27, 2024 | 8:04 PM

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది తమ ప్రతిభను చాటుకుంటూ సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. కొంతమంది హీరోలుగా సక్సెస్ అయ్యారు. మరికొంతమంది దర్శకులుగా, కమెడియన్స్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా సక్సెస్ అయ్యారు. పైన కనిపిస్తున్న పిల్లలో ఓ టాలెంటడ్ డైరెక్టర్ ఉన్నాడు. చేసింది తక్కువ సినిమాలే అయినా బాక్సాఫీస్ కింగ్ అయ్యాడు. ఇప్పుడు ఎక్కడ చూసిన ఆయన పేరే వినిపిస్తుంది. ఆయనతో సినిమాలు చేయడానికి ఇప్పుడు స్టార్ హీరోలు క్యూ కడుతున్నారు. ఇంతకు ఆ దర్శకుడు ఎవరో గుర్తుపట్టారా.? పెద్ద కష్టమేమో కాకపోవచ్చు.. ఆమె ఇప్పుడు పాన్ ఇండియా దర్శకుడు. తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు పైకెక్కించిన డైరెక్టర్. ప్రస్తుతం ఆయన పేరుతో పాటు ఆయన చైల్డ్ హుడ్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకూ ఆయన ఎవరో కనిపెట్టారా.?

పై ఫొటోలో స్కూల్ పిల్లలో ఉన్న దర్శకుడి పేరు చెప్తే షాక్ అవుతారు. ఆయనేనా అని ఆశ్చర్యపోతారు. పై ఫొటోలో ఉన్నది ఎవరో కాదు టాలెంటడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన నాగ్ అశ్విన్. దర్శకుడు, స్క్రీన్ రైటర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నాగీ.. యాదోం కీ బరాత్  అనే షార్ట్ ఫిలిం చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు నాగీ. ఆతర్వాత దర్శకుడు శేఖర్ కమ్ముల వద్ద లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేసాడు.

ఎవడే సుబ్రహ్మణ్యం అనే సినిమాతో దర్శకుడిగా మారాడు. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే మహానటి సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నాడు నాగ్ అశ్విన్. జాతిరత్నాలు సినిమాకు నిర్మాతగానూ వ్యవహరించాడు నాగీ. ఇక ఇప్పుడు కల్కి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. నేడు విడుదలైన కల్కి సినిమా సంచలన విజయాన్నినమోదు చేసుకుంది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కింది. మహాభారతాన్ని సైన్స్ తో మిక్స్ చేసి ఈ సినిమాను తెరకెక్కించాడు నాగీ. ఇప్పుడు ఈ సినిమా అన్ని రికార్డ్స్ యూ బద్దలు కొడుతుంది. బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. తొలి రోజే కల్కి సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సాదిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఇప్పుడు నాగ్ అశ్విన్ తో సినిమా చేయడానికి స్టార్ హీరోలు ఎదురుచూస్తున్నారు.

View this post on Instagram

A post shared by nagi (@nag_ashwin)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.