Sonu Sood: గ్రాడ్యుయేట్ చాయ్ వాలీకి సోనూ ఆర్ధిక సాయం.. త్వరలో టీ కోసం వస్తా అంటూ ట్విట్.. నువ్వు రియల్ హీరో అంటున్న ఫ్యాన్స్

|

Nov 21, 2022 | 11:26 AM

కష్టాల్లో ఉన్న వ్యక్తులకు అండగా నిలబడి ఆర్ధికంగా భరోసా నిస్తూ.. రియల్ హీరో అయ్యాడు. ఇప్పటికే అనేక మందికి శస్త్రచికిత్సలను చేయించాడు. నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాడు. ఎంతో మందికి చదువు కోసం డబ్బు సాయం చేశాడు. ఇప్పుడు ప్రియాంక గుప్తాకి కూడా సాయం అందించాడు.

Sonu Sood: గ్రాడ్యుయేట్ చాయ్ వాలీకి సోనూ ఆర్ధిక సాయం.. త్వరలో టీ కోసం వస్తా అంటూ ట్విట్.. నువ్వు రియల్ హీరో అంటున్న ఫ్యాన్స్
Sonu Sood Helped Graduate Chai wali
Follow us on

చదువుకుని ఉద్యోగ ప్రయత్నం చేసింది.. అయినప్పటికీ ఉద్యోగం రాలేదు.. దీంతో తనకు తానె ఉపాధి కల్పించుకోవాలని భావించి సొంతంగా టీ దుకాణాన్ని ప్రారంభించి ఫేమస్ అయింది ప్రియాంక గుప్తా.  గ్రాడ్యుయేట్ చాయ్ వాలీ యజమాని.  ఎకనామిక్స్‌లో డిగ్రీ చేసినా సరైన ఉద్యోగం రాకపోవడంతో చాయ్ వాలీగా మారింది. పాట్నా మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల టీ దుకాణాన్ని జప్తు చేయడంతో.. మళ్ళీ ప్రియాంక కష్టాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా తాను ఎదుర్కొంటున్న పరిస్థితిని తన నిస్సహాయ స్థితిని వీడియో ద్వారా వివరించింది.  తాజాగా ప్రియాంక కష్టాలపై సోనూసూద్ స్పందించాడు . రియల్ హీరో ప్రియాంక గుప్తాకు కొత్త టీ దుకాణం  ఏర్పటు చేసుకోవడం కోసం సహాయం చేశాడు. దీంతో తన కొత్త టీ స్టాల్ ను మళ్ళీ ఓపెన్ చేయనుంది. సోనూసూద్ చేసిన ఈ సహాయానికి అభిమానులు బాసు నువ్వు సూపర్ అని అంటున్నారు.

కరోనా వెలుగులోకి వచ్చిన.. లాక్ డౌన్ విధించినప్పటి నుంచి సోనూ సూద్ ప్రజలకు సహాయం చేస్తూనే ఉన్నాడు. కష్టాల్లో ఉన్న వ్యక్తులకు అండగా నిలబడి ఆర్ధికంగా భరోసా నిస్తూ.. రియల్ హీరో అయ్యాడు. ఇప్పటికే అనేక మందికి శస్త్రచికిత్సలను చేయించాడు. నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాడు. ఎంతో మందికి చదువు కోసం డబ్బు సాయం చేశాడు. ఇప్పుడు ప్రియాంక గుప్తాకి కూడా సాయం అందించాడు.

ఇవి కూడా చదవండి

కన్నీటి పర్యంతమైన గ్రాడ్యుయేట్:

తాను భిన్నంగా ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నానని .. తన నిర్ణయానికి  ప్రజలు మద్దతు పలికారని .. అయితే ఇది బీహార్. ఇక్కడ మహిళల స్థానం వంటగదికే పరిమిటం అంటూ ప్రియాంక కన్నీరు పెట్టుకున్నారు.  పాట్నాలో అనేక అక్రమ వ్యాపారాలు జరుగుతున్నాయి.. వీటిని అరికట్టే విధంగా అధికారులు పనిచేయడం లేదు. కానీ ఓ అమ్మాయి సొంత వ్యాపారం చేసుకుంటే పదే పదే అడ్డుతగులుతున్నారు’’ అని ప్రియాంక గుప్తా కన్నీరుతో అభ్యర్ధిస్తున్న ఓ వీడియో రిలీజ్ ను కొన్ని రోజుల క్రితం రిలీజ్ చేసింది.

సోనూ సూద్ స్పందన:

ప్రియాంక గుప్తా వీడియో వైరల్‌గా మారడంతో సోనూసూద్ దీనిపై స్పందించారు. ‘ప్రియాంక టీ దుకాణం ఏర్పాటు చేయడానికి ఆర్ధికంగా అండగా బిలబడ్డారు. తాను బీహార్ వెళ్ళినప్పుడు ఆమె దుకాణంలో టీ రుచి చూస్తాను” అని సోనూసూద్ ట్వీట్ చేశారు.

ఇప్పుడు ప్రియాంక గుప్తా తన టీ షాప్ బ్రాంచ్‌ను వివిధ ప్రాంతాల్లో ప్రారంభించాలని ఆలోచిస్తుంది. ఈ మేరకు ప్రియాంక సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. ప్రియాంక తో పాటు.. తాము కూడా చాయ్ వాలీగా పనిచేయడానికి అనేక మంది ఆసక్తిని చూపిస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..