Peddi Movie: పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబుకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన శివన్న.. ఏంటో తెలుసా? ఫొటో వైరల్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా పెద్ది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తోన్న ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయిక. అలాగే కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

Peddi Movie: పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబుకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన శివన్న.. ఏంటో తెలుసా? ఫొటో వైరల్
Shiva Rajkumar, Buchi Babu

Updated on: Feb 17, 2026 | 10:25 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న ‘పెద్ది’ సినిమాపై రోజు రోజకు అంచనాలు పెరిగిపోతున్నాయి. భారీ స్టార్ క్యాస్టింగ్ తో తెరకెక్కిస్తోన్న ఈ మూవీ మార్చి 26న విడుదల కావాల్సి ఉంది. అయితే అనూహ్యంగా ఏప్రిల్ 30కు వాయిదా పడింది. ఉప్పెన సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు సనా పెద్ది సినిమాను తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ రామ్ చరణ్ తో రొమాన్స్ చేయనుంది. న్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ దివ్యేందు త్రిపాఠి, కమెడియన్ సత్య తదితరులు ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. విలేజ్ స్పోర్ట్స్ డ్రామా గా రూపొందుతున్న ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, గ్లింప్స్ , సాంగ్ కు ఆడియెన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా చికిరీ సాంగ్ కు యూట్యూబ్ లో వందల మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం పెద్ది సినిమా షూటింగ్ తెరకెక్కుతోంది. పెద్ది మూవీ సినిమా సెట్స్‌లో గ్రాండ్‌గా బుచ్చిబాబు పుట్టిన నిర్వహించారు.

ఇదిలా ఉంటే ఇటీవల పెద్ది మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు తన పుట్టిన రోజు జరుపుకొన్నారు. పెద్ది మూవీ సినిమా సెట్స్‌లో గ్రాండ్‌గా బుచ్చిబాబు బర్త్ డే వేడుకలు జరిగాయి. ఆ టైంలో ఈ చిత్ర డైరెక్టర్‌కు శివన్న సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. డైరెక్టర్ బుచ్చిబాబే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. శివరాజ్‌కుమార్‌తో కలిసి దిగిన ఫొటోన సోషల్ మీడియాలో షేర్ చేసి ‘థ్యాంక్‌ యూ సో మచ్‌ ఫర్ లవ్‌లీ గిఫ్ట్’ అని రాసుకొచ్చాడు. అంతకు ముందు రామ్ చరణ్‌ కూడా ఈ డైరెక్టర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

శివరాజ్ కుమార్ తో డైరెక్టర్ బుచ్చి బాబు సనా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us