Rajendra Prasad: మళ్లీ నోరు జారిన రాజేంద్రప్రసాద్.. బ్రహ్మానందంపై అలాంటి మాటలా.. ?

దశాబ్దాలుగా తెలుగు సినీరంగంలో అనేక హిట్ చిత్రాలు, వైవిధ్యమైన పాత్రలు పోషించి తనదైన ముద్ర వేశారు. ఇప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటిస్తూ చాలా బిజీగా ఉంటున్నారు. కానీ కొన్నాళ్లుగా ఆయన మాటలతో వివాదాల్లో చిక్కుకుంటున్నారు. సినిమాల్లో తన నటనతో అలరించిన రాజేంద్రప్రసాద్... ఇప్పుడు పలు సినిమా ఈవెంట్లలో మాట్లాడే తీరు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

Rajendra Prasad: మళ్లీ నోరు జారిన రాజేంద్రప్రసాద్.. బ్రహ్మానందంపై అలాంటి మాటలా.. ?
Rajendra Prasad

Updated on: Nov 30, 2025 | 10:57 AM

నటకిరీటి రాజేంద్రప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దశాబ్దాలుగా తన నటనతో సినీప్రియులను అలరిస్తున్నారు. ఒకప్పుడు హీరోగా మెప్పించిన ఆయన.. ఇప్పుడు సహాయ నటుడిగా కొనసాగుతున్నారు. ఇప్పటికీ వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు. కానీ గతకొంత కాలంగా పలు సినీ ఈవెంట్లలో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. సినిమా ఫంక్షన్లలో ఆయన మాట్లాడే తీరు వివాదాస్పదమవుతుంది. తోటీ నటుల గురించి రాజేంద్రప్రసాద్ చేసే కామెంట్స్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇటీవల రాబిన్ హుడ్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ పై డేవిడ్ వార్నర్ గురించి అనుచితంగా మాట్లాడారు. అలాగే అంతకు ముందు ఓ ఈవెంట్లో అలీని దారుణంగా తిట్టారు. ఆ తర్వాత తన మాటలపై వివరణ ఇచ్చారు. మరోసారి నోరు జారకుండా జాగ్రత్తలు తీసుకుంటానని వివరణ ఇచ్చారు. అయితే ఇప్పుడు మరోసారి తన మాట తీరుతో విమర్శలకు గురవుతున్నారు.

ఇవి కూడా చదవండి :  Hema Chandra: శ్రావణ భార్గవితో విడాకుల రూమర్స్.. హేమచంద్ర రియాక్షన్ ఇదే..

తాజాగా స:కుటుంబానాం సినిమా ఈవెంట్ కు బ్రహ్మానందంతోపాటు రాజేంద్రప్రసాద్ కూడా హాజరయ్యారు. బ్రహ్మీ ప్రసంగం ముగిసిన తర్వా మైక్ అందుకుని మాట్లాడుతూ మరోసారి నోరు జారారు రాజేంద్రప్రసాద్. పద్మ శ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మానందం గారు మాట్లాడిన తర్వాత మేం మాట్లాడటం.. ఎంతైనా మీ శిష్యులమే కదా అని స్టార్ట్ చేసిన ఆయన.. ఆకస్మాత్తుగా.. నువ్వు ముసలి..అంటూ నోరు జారారు. వెంటనే బ్రహ్మానందం ఎవరు ? అని అడగ్గా.. నేనే అంటూ కవర్ చేసేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

ఇవి కూడా చదవండి : Actress : 50 సినిమాల్లో హీరోయిన్.. ఒక్కరోజులోనే కెరీర్ క్లోజ్.. అసలేం జరిగిందంటే..

మరోసారి రాజేంద్రప్రసాద్ కామెంట్స్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. సినిమా ఈవెంట్లలో ఆయన ప్రతిసారి ఇలాగే ప్రవర్తిన్నారని కామెంట్స్ చేస్తున్నారు. రాజేంద్రప్రసాద్ తీరులో ఎలాంటి మార్పులు రావడం లేదని అంటున్నారు. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు రాజేంద్రప్రసాద్ స్పందించలేదు.

ఇవి కూడా చదవండి : Serial Actress : సినిమాల్లో హీరోయిన్ కావాలనుకుంది.. కట్ చేస్తే.. సీరియల్స్‏లో విలన్ అయ్యింది.. గ్లామర్ క్వీన్ రా బాబూ..

 

ఇవి కూడా చదవండి : Amala Paul : ఆ సినిమాలో నటించి తప్పు చేశాను.. అప్పుడు నాకు 17 సంవత్సరాలే.. హీరోయిన్ అమలా పాల్..