Nagarjuna: భజ్జీని వెండితెరపై చూడడం ఆనందంగా ఉంది.. ఫ్రెండ్స్ టీంకు ఆల్ ది బెస్ట్ చెప్పిన నాగార్జున..

| Edited By: Ravi Kiran

Sep 08, 2021 | 11:45 AM

టీమిండియా మాజీ క్రికెట్ బౌలర్ హర్బజన్ సింగ్ సినీ రంగ ప్రవేశం చేస్తున్న సంగతి తెలిసిందే. బజ్జి ప్రధాన పాత్రలో ఫ్రెండ్‍షిప్ సినిమా తెరకెక్కుతుంది

Nagarjuna: భజ్జీని వెండితెరపై చూడడం ఆనందంగా ఉంది.. ఫ్రెండ్స్ టీంకు ఆల్ ది బెస్ట్ చెప్పిన నాగార్జున..
Nagarjuna
Follow us on

టీమిండియా మాజీ క్రికెట్ బౌలర్ హర్బజన్ సింగ్ సినీ రంగ ప్రవేశం చేస్తున్న సంగతి తెలిసిందే. బజ్జి ప్రధాన పాత్రలో ఫ్రెండ్‍షిప్ సినిమా తెరకెక్కుతుంది. జాన్ పాల్ శామ్, శామ్ సూర్య దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడింది. తాజాగా పరిస్థితులు మెరుగుపడడంతో ఈ సినిమాను విడుదల చేసే పనిలో పడ్డారు మేకర్స్. భారీ బడ్జెట్‏తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలో నటిస్తు్న్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, పోస్టర్స్‏‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇక ఇటీవల విడుదలైన ఫ్రెండ్‏షిప్ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో హర్బజన్‌ ఓ కాలేజీ స్టూడెంట్‌ పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యను ఈ సినిమా ఇతివృత్తంగా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ మూవీ ట్రైలర్ చూసిన నాగార్జున.. హర్బజన్ సింగ్‏ను వెండితెరపై చూడడం ఆనందంగా ఉందని.. సినిమా విజయం సాధించాలని చిత్రయూనిట్‏కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ చిత్రాన్ని ఎ.ఎన్ బాలాజీ నిర్మిస్తున్నారు.

ట్వీట్..

Also Read: Viral video : పిల్లను కాపాడుకోవడానికి తల్లి కుక్క తాపత్రయం.. మనసుకు హత్తుకుంటున్న వీడియో

Ichata Vahanamulu Niluparadu: ఆహాలో మరో హిట్ మూవీ.. ఇచ్చట వాహనములు నిలుపరాదు విడుదల ఎప్పుడంటే..

Tollywood Drug Case: టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న డ్రగ్స్.. సెలబ్రిటీలకు ఈడీ వేడి.. ఈరోజు ఈడీ ముందుకు రానా దగ్గుబాటి.. ముమైత్ ఖాన్..

Bigg Boss 5 Telugu: సీన్ రివర్స్.. బోరు బోరున ఏడ్చేస్తున్న అబ్బాయిలు.. తట్టుకోలేకపోయానంటున్న ఆ కంటెస్టెంట్..