Murali Mohan: కాలేజీలో ఆ హీరోను దేవుడు అని పిలిచేవారు.. స్నేహానికి ప్రాణమిస్తారు.. నటుడు మురళి మోహన్..

నటుడు మురళీ మోహన్ తన సుదీర్ఘ కెరీర్ ప్రయాణం, వ్యాపారం పట్ల తన ఆసక్తి, నటనను అదృష్టంగా భావించడంపై పంచుకున్నారు. అలాగే టాలీవుడ్ స్టార్ హీరోతో తన కాలేజీ రోజులను గుర్తుచేసుకుంటూ, నిర్మాతలకు కృష్ణ అందించిన అద్భుతమైన మద్దతు, డేరింగ్ పర్సనాలిటీని వెల్లడించారు. సినిమా రంగంలో కృష్ణ నిస్వార్థ సేవను ఆయన ప్రశంసలు కురిపించారు.

Murali Mohan: కాలేజీలో ఆ హీరోను దేవుడు అని పిలిచేవారు.. స్నేహానికి ప్రాణమిస్తారు.. నటుడు మురళి మోహన్..
Murali Mohan

Updated on: Jun 06, 2026 | 11:27 AM

నటుడు మురళీ మోహన్ తన సుదీర్ఘ కెరీర్‌లో సినిమా, వ్యాపారం, రాజకీయ రంగాల గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ మూడింటిలో తనకు వ్యాపార రంగమే అత్యంత ఇష్టమైనదని, అందులోనే తాను అనుకున్న లక్ష్యాలను సాధించానని స్పష్టం చేశారు. అయితే సినిమా రంగంలో నటుడు కావడం అదృష్టంగా భావిస్తున్నానని, అది పూర్వజన్మలో చేసిన పుణ్యం లాంటిదని ఆయన చెప్పారు. వ్యాపారవేత్తను తమ చుట్టూ ఉన్న కొద్ది మంది మాత్రమే గుర్తిస్తే, సినిమా నటుడిని మాత్రం ఎక్కడికెళ్లినా అందరూ ఆదరిస్తారని, ప్రేమ చూపిస్తారని మురళీ మోహన్ వివరించారు. రాజకీయాల్లో పదవి ఉన్నంత వరకు గౌరవం ఉంటుందని, పదవి దిగగానే ఎవరూ గుర్తుపట్టరని, విమర్శిస్తారని పేర్కొన్నారు. అందుకే తాను సినిమా పరిశ్రమలోనే ఎక్కువ ఆనందం పొందానని తెలిపారు. తన అభిమాన నటుడు అక్కినేని నాగేశ్వరరావు అని మురళీ మోహన్ వెల్లడించారు. ఎన్టీఆర్ పౌరాణిక, జానపద చిత్రాలు నచ్చినా, సామాజిక చిత్రాలలో అక్కినేని అంటే తనకు ఇష్టమని చెప్పారు. నాగేశ్వరరావు ప్రభావం తన నటనపై చాలా ఉండేదని, కొందరు తనను ఆయనతో పోల్చేవారని గుర్తుచేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Brahmanandam : చివరి రోజుల్లో ఎంఎస్ నారాయణ కోరిన ఆఖరి కోరిక అదే.. హాస్పిటల్ బెడ్ మీద అలా చూశాక.. బ్రహ్మానందం ఎమోషనల్..

సూపర్ స్టార్ కృష్ణతో తన కాలేజీ రోజులను మురళీ మోహన్ గుర్తుచేసుకున్నారు. కృష్ణ చాలా అమాయకంగా, తక్కువ మాట్లాడే వ్యక్తిగా ఉండేవారని, కాలేజీలో ఆయనకు దేవుడు అనే నిక్‌నేమ్‌ ఉండేదని చెప్పారు. ఎలూరు కాలేజీలో అక్కినేని నాగేశ్వరరావు వజ్రోత్సవ సభకు పెకేటి శివరాం హాజరై ప్రసంగించడంతో వచ్చిన స్పందన చూసి కృష్ణకు నటుడిగా మారాలనే ఆలోచన వచ్చిందని మురళీ మోహన్ వివరించారు. కృష్ణ తనతో మనం ఇంత అందంగా ఉన్నాం కదా, ఎందుకు ప్రయత్నించకూడదు? అని అడిగేవారని చెప్పారు. ఆ తర్వాత దర్శకుడు కే.బి. తిలక్ ఇచ్చిన ప్రోత్సాహంతో కృష్ణ నటన వైపు అడుగులు వేశారని మురళీ మోహన్ తెలిపారు. కృష్ణకు పెద్ద నటుడు అవ్వాలని, తన ఊళ్లో థియేటర్‌ కట్టాలని, పెద్ద కారు కొనాలని బలమైన కోరికలు ఉండేవని చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి : Meenakshi Chaudhary : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. ఎప్పటికైన అతడితో ‏డేట్‏కు వెళ్తాను.. హీరోయిన్ మీనాక్షి చౌదరి..

సూపర్ స్టార్ కృష్ణ కేవలం గొప్ప నటుడిగానే కాకుండా, నిర్మాతలకు ఎల్లప్పుడూ అండగా నిలిచారని మురళీ మోహన్ కొనియాడారు. సినిమా ఫ్లాప్ అయినప్పుడు నిర్మాత కనపడకపోతే, అతడిని పిలిపించి, డబ్బులు లేకపోతే తానే ఫైనాన్స్ చేయించి, డైరెక్టర్‌ను, సబ్జెక్టును ఎంపిక చేసి, డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడి సినిమాను విడుదల చేయించేవారని మురళీ మోహన్ గుర్తుచేసుకున్నారు. లాభాలు వస్తే నిర్మాతకే తిరిగి ఇచ్చేవారని, ఇలా ఎవరు చేయరని ఆయన ప్రశంసించారు. తన కెరీర్‌లో ఏ రోజూ కూడా డబ్బులు ఇస్తేనే షూటింగ్‌కు వస్తాను అని కృష్ణ అనలేదని, ముందు సినిమా పూర్తి చేయమని చెప్పేవారని తెలిపారు. తన వ్యాపార నేపథ్యం కారణంగా నిర్మాత కష్టాలు తెలుసు కాబట్టే తాను కూడా కృష్ణ మాదిరిగా డబ్బుల కోసం ఎప్పుడూ ఒత్తిడి చేయలేదని మురళీ మోహన్ వెల్లడించారు. కాలేజీలో అమాయకుడిగా కనిపించిన కృష్ణ, మోసగాళ్లకు మోసగాడు, అల్లూరి సీతారామరాజు వంటి డేరింగ్ చిత్రాలతో యాక్షన్ హీరోగా మారిన తీరు అద్భుతమని మురళీ మోహన్ చెప్పుకొచ్చారు.

ఎక్కువ మంది చదివినవి : Peddi Movie : ఏం తీశాడు భయ్యా.. చరణ్ ఎంట్రీ మైండ్ బ్లోయింగ్.. ఆ ఒక్క సీన్ గూస్ బంప్స్..

Follow Us