Gopichand: మరో ప్రాజెక్ట్‏ను పట్టాలెక్కించిన టాలెంటెడ్ హీరో.. గోపిచంద్ 30 సినిమాకు డైరెక్టర్ ఎవరంటే…

|

Dec 24, 2021 | 9:38 AM

టాలెంటెడ్ హీరో గోపిచంద్ చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. బ్యాక్ టూ బ్యాక్

Gopichand: మరో ప్రాజెక్ట్‏ను పట్టాలెక్కించిన టాలెంటెడ్ హీరో.. గోపిచంద్ 30 సినిమాకు డైరెక్టర్ ఎవరంటే...
Gopichand
Follow us on

టాలెంటెడ్ హీరో గోపిచంద్ చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ హీరో మంచి టాక్ సొంతం చేసుకున్నప్పటికీ సూపర్ హిట్ మాత్రం పడడం లేదు. ఇటీవల సంపత్ నంది దర్శకత్వంలో సీటీమార్ సినిమా చేశాడు గోపీచంద్. కబడ్డీ నేపథ్యంలో వచ్చినా మూవీ పర్వాలేదు అనిపించుకుంది. ఇక ప్రస్తుతం గోపిచంద్ మారుతీ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. తక్కువ సమయంలోనే టాప్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న మారుతీ.. నాని ప్రధాన పాత్రలో వచ్చిన భలే భలే మగాడివోయ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు.

ఇక ఇప్పుడు మారుతీ దర్శకత్వంలో గోపీచంద్ పక్కా కమర్షియల్ అనే సినిమా చేస్తున్నాడు. యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా గోపిచంద్ తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించే పనిలో పడ్డాడు. డైరెక్టర్ శ్రీవాస్ దర్శకత్వంలో గోపిచంద్ తన 30వ సినిమాను చేయబోతున్నాడు. ఇంతకు ముందు వీరిద్దరి కాంబోలో లౌక్యం, లక్ష్యం అనే రెండు సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఈరోజు ఘనంగా జరుగబోతున్నాయి. ఈరోజు ఉదయం 11.13 నిమిషాలకు పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ చిత్రానికి విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.

Also Read: Radhe Shyam Trailer: ప్రాణం పోసే ప్రేమ ప్రాణం తీయగలదా.. రాధేశ్యామ్ ట్రైలర్ అదుర్స్..

Thaggedhe Le: ‘తగ్గేదే లే’ డైలాగ్ చెప్పిన క్రికెటర్ జడేజా.. పుష్ప ఫీవర్ మాములుగా లేదుగా..

Pushpa: యూట్యూబ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన శ్రీవల్లి సాంగ్‌.. 100 మిలియన్ల వ్యూస్‌ను దాటేసి..