Manchu Manoj: ఆ రోజు నిజంగానే మంచు మనోజ్‌ ధనరాజ్‌ను కొట్టడానికి వెళ్లాడా..?

నటుడు ధనరాజ్ మంచు మనోజ్ ప్రాంక్ వీడియోపై స్పందించారు. జంప్ జిలాని ఆడియో లాంచ్‌లో జరిగిన ఆ ప్రాంక్, దాని తర్వాత వచ్చిన ట్రోల్స్, వాటిని ఎదుర్కోవడానికి మనోజ్, తాను కలిసి చేసిన ఫోటో షూట్ గురించి వివరించారు. ఆ డీటేల్స్ ఈ కథనంలో ...

Manchu Manoj: ఆ రోజు నిజంగానే మంచు మనోజ్‌ ధనరాజ్‌ను కొట్టడానికి వెళ్లాడా..?
Dhanaraj - Manchu Manoj

Updated on: Mar 23, 2026 | 11:47 AM

ప్రముఖ నటుడు ధనరాజ్ ఓ ఇంటర్వ్యూలో మంచు మనోజ్‌తో తనకున్న అనుబంధం, వైరల్ అయిన ప్రాంక్ వీడియో వెనుకటి కథ, అలాగే మనోజ్ ప్రస్తుత సినీ కెరీర్ విరామంపై పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాను మనోజ్‌తో కలిసి కరెంట్ తీగ చిత్రంలో నటించానని గుర్తుచేసుకున్నారు. ధనరాజ్ మాట్లాడుతూ, జంప్ జిలాని ఆడియో లాంచ్ సందర్భంగా మంచు మనోజ్ తనపై ఒక ప్రాంక్ ప్లే చేశారని, అయితే అది తనకు ముందే తెలుసని తెలిపారు. తమ కామన్ ఫ్రెండ్  భూపాల్ ద్వారా ఈ ప్రాంక్ గురించి తనకు సమాచారం అందిందని ధనరాజ్ చెప్పారు. అయినప్పటికీ, తాను సహజ నటనకు ప్రాధాన్యతనిస్తానని, అందుకే మనోజ్ తనపై కోపం వ్యక్తం చేసినప్పుడు నిజంగానే భయపడినట్లు, ఆశ్చర్యపోయినట్లు నటించానని ధనరాజ్ పేర్కొన్నారు. ఆ సమయంలో తాము స్టేజ్ మీద ఉండటం, కెమెరాలు లైవ్‌లో ఉండటంతో, అది మరింత సహజంగా కనిపించిందని ఆయన వివరించారు. ఈ ప్రాంక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, చాలామంది మనోజ్‌ను తప్పుగా అర్థం చేసుకుని ట్రోల్ చేయడం ప్రారంభించారు. అప్పటికే కరెంట్ తీగ షూటింగ్‌లో ఉన్న మనోజ్, ఈ ట్రోల్స్ గురించి తెలుసుకుని తనను పిలిచినట్లు వెల్లడించారు. ట్రోల్స్‌కు సమాధానంగా ఒక పనిచేద్దామని మనోజ్ సూచించారని, తాను చేతులు కట్టుకుని నిలబడతానని, ధనరాజ్ తన భుజంపై చేయి వేయాలని మనోజ్ కోరారని ధనరాజ్ చెప్పారు. ఆ పిక్‌ను  పోస్ట్ చేశామని, అది తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేసిందని ఆయన పేర్కొన్నారు.

మనోజ్‌తో తన రిలేషన్ గురించి మాట్లాడుతూ, తాము నిత్యం టచ్‌లో ఉండే స్నేహితులు కాదని, ఏదైనా ఆడియో లాంచ్ వంటి సందర్భాల్లో కలుసుకోవడం, లేదా క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకోవడం జరుగుతుందని ధనరాజ్ స్పష్టం చేశారు. మంచు మనోజ్ కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండటంపై మాట్లాడుతూ, ఆయన ఒక బలమైన కమ్‌బ్యాక్ ఇవ్వాలని అనుకుంటున్నారని, అందుకోసమే ఒక మంచి కథ కోసం వేచి చూశారని ధనరాజ్ వివరించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us