Chatrapathi Sekhar : భార్యతో విడాకులు.. తప్పంతా నాదే.. కారణం చెప్పినా టాలీవుడ్ నటుడు..

టాలీవుడ్ ఇండస్ట్రీలో పాపులర్ నటుడు చత్రపతి శేఖర్. ముఖ్యంగా రాజమౌళి తెరకెక్కించే ప్రతి సినిమాలో ఆయన కనిపించాల్సిందే. స్టూడెంట్‌ నెం.1, సింహాద్రి, సై, విక్రమార్కుడు, ఛత్రపతి, మగధీర, ఆర్‌ఆర్‌ఆర్‌.. ఇలా తెలుగులో అనేక హిట్‌ సినిమాల్లో నటించాడు. అసలు పేరు చంద్రశేఖర్. అయితే ఛత్రపతి శేఖర్‌గానే స్థిరపడిపోయాడు. వెండితెరపై క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఓ వెలుగు వెలిగిన ఇతడు బుల్లితెరపై సీరియల్స్‌ కూడా చేస్తున్నాడు. తాజాగా శేఖర్‌ ఓ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

Chatrapathi Sekhar : భార్యతో విడాకులు.. తప్పంతా నాదే.. కారణం చెప్పినా టాలీవుడ్ నటుడు..
Chatrapathi Sekhar

Updated on: Aug 20, 2026 | 9:54 PM

నటుడు ఛత్రపతి శేఖర్ ఇటీవల తన వ్యక్తిగత జీవితం, విడాకులు, సినీ రంగంలో ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆర్థిక అలవాట్లపై ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇండస్ట్రీలోకి రావడానికి ముందే తనకు వివాహమైందని, ఆ సమయంలో తన సంపాదన తక్కువగా ఉండేదని వెల్లడించారు. సినీ రంగంలో గుర్తింపు వచ్చాక, బిజీ అయ్యాక కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు మొదలయ్యాయని, ఇది విడాకులకు దారితీసిందని వివరించారు. భార్యాభర్తల మధ్య విభేదాలు సహజమేనని, ఒకరినొకరు నిందించుకోవడం, రోజూ కొట్లాడుకోవడం కంటే దూరం ఉండడమే మేలని అప్పట్లో నిర్ణయించుకున్నామని తెలిపారు. ఈ నిర్ణయానికి ఎవరినీ తప్పుబట్టడం లేదని, ఇద్దరి వైపు నుంచీ కొన్ని తప్పులు జరిగి ఉంటాయని అన్నారు. తాను బాధపడటం లేదని, వారు బాగుంటే చాలని కోరుకుంటానని అన్నారు. తన కుమార్తె ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగం చేస్తుండగా, కుమారుడు ముంబైలో శిక్షణ పొంది సినీ రంగంలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాడని తెలిపారు. కొడుకుకు మంచి వేషం దొరికితే బాగుండని ఆశపడ్డారు.

శేఖర్ తన వ్యక్తిత్వంలోని కొన్ని లక్షణాలను స్పష్టంగా చెప్పారు. తాను బద్ధకస్తుడిని అని, అంత సులభంగా ఇతరుల మాట విననని, మొహమాటం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఆర్థిక విషయాల్లో తాను క్రమశిక్షణ లేనివాడినని, పెద్దగా ఆలోచించనని ఒప్పుకున్నారు. కష్టపడి సంపాదించిన లక్షలాది రూపాయలు ఇతరులకు సహాయంగా ఇచ్చానని, తిరిగి అడగలేదని, భవిష్యత్తులో కూడా అడగనని చెప్పారు. దేవుడు ఇస్తాడు కాబట్టి తిరిగి అడగాల్సిన అవసరం లేదనేది తన భావన అన్నారు. సినీ రంగంలో అవకాశాలు అడగడం, ఎవరికీ సలాం చేయడం, మోసపోతే డబ్బులు వదిలేయడం వంటి తన అలవాట్లు ఇండస్ట్రీకి సరిపోవని ఇంటర్వ్యూయర్ అన్నప్పుడు, తాను పక్కగా దేవుడిని నమ్ముతానని, ఆయనే నడిపిస్తాడని బదులిచ్చారు.

అయితే, ఇటీవల కాలంలో తన అలవాట్లలో కొంత మార్పు వచ్చిందని శేఖర్ వెల్లడించారు. గతంలో సినిమా పూర్తయిన తర్వాత డబ్బులు తీసుకునేవాడినని, కానీ పలుమార్లు మేనేజర్లు ఫోన్ కూడా ఎత్తకపోవడం, డబ్బులు ఇవ్వకపోవడంతో ఇప్పుడు పని చేసే ముందు పారితోషికం అడుగుతానని తెలిపారు. చిన్న సినిమా వాళ్లు గౌరవంగా, మంచి పద్ధతిలో ఉంటారని, వారికి సహకరించడానికి తాను సిద్ధంగా ఉంటానని అన్నారు. తాను చిన్నవాడినేనని, తనకు ఆస్తులు, శిస్తులు ఏమీ లేవని, మరీ అన్యాయంగా మాట్లాడితే మాత్రం సారీ చెప్పి వెళ్ళిపోతానని స్పష్టం చేశారు.

ఎక్కువమంది చదివినవి : Mokshagna : వారసుడు వచ్చేస్తున్నాడు.. దసరాకు మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే..

ఛత్రపతి శేఖర్..

Chatrapathi Sekhar, Wife

ఎక్కువమంది చదివినవి : Jr.NTR : ఎన్టీఆర్‏తో చేసిన ఆ సినిమా ప్లాప్ కావడానికి కారణం అదే.. ఆ నిర్ణయమే పొరపాటు అయ్యింది..

Loading...
Unable to load recommendations.
Follow Us