
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు (Pawan Kalyan) ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవర్ స్టార్ కోసం ఏమైనా చేయడానికి రెడీగా ఉంటారు. యూత్‌లో పవన్‌కు ఉండే క్రేజ్ గురించి తెలసిందే. పవర్ స్టార్‌కు ఉన్న అభిమానుల్లో నిర్మాత.. నటుడు బండ్ల గణేష్ (Bandla Ganesh) స్థానం ప్రత్యేకం. పవన్ కళ్యాణ్‌ను దేవుడిలా ఆరాధిస్తుంటాడు. ఇక ఆయన గురించి బండ్ల గణేష్ ఇచ్చే స్పీచ్ వేరేలెవల్. చాలా వరకు పవన్ కళ్యాణ్ సినిమా ఈవెంట్స్‌లో బండ్ల గణేష్ ఇచ్చే స్పీచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇక దేవరా అంటూ అనేక పవర్ ఫుల్ డైలాగ్స్‌తో బండ్ల గణేష్ ఇచ్చే స్పీచ్‌కు ఆడిటోరియం మొత్తం దద్దరిల్లిపోతుంది. ఇటీవల పవన్ కళ్యాణ్.. రానా దగ్గుబాటి నటించిన భీమ్లా నాయక్ సినిమా ఫంక్షన్స్‌కు బండ్ల గణేష్ వస్తారని ఎంతో ఆశగా ఎదురుచూసిన ఫ్యాన్స్.. ఆయన రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. బండ్ల గణేష్ రాకపోవడానికి గల కారణమేంటని పవన్ ఫ్యాన్స్ బాహాటంగానే అడిగారు. తాజాగా బండ్ల గణేష్ జనసేనా పార్టీ ఆవిర్భావ సభ గురించి వరుస ట్వీట్స్ చేస్తున్నారు.
ఇవాళ ఉదయం నుంచి పవన్ కళ్యాణ్ జనసేనా పార్టీ ఆవిర్భావ సభపై వరుస ట్వీట్స్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఉత్సాహపరుస్తున్నారు. ” వీరులారా ధీరులారా,జన సేన సైనికులారా !! రండి కదలి రండి కడలి అలగా తరలి రండి. నేను కూడా వస్తున్నాను. మన దేవర నిజాయతీకి సాక్షిగా నిలబడడం కోసం, తెలుగు వాణి వాడి వేడి నాడి వినిపించడం కోసం, అమరావతి నించి హస్తిన దాకా అలజడి పుట్టించడం కోసం కలుద్దాం. కలిసి పోరాడదాం” అంటూ ట్వీట్ చేస్తున్నారు. దేవర జెండా కి కర్రనౌతా.. దేవర రధచక్రానికి కీలునౌతా .. అని.. ” ఇచ్చాపురం నించి హిందూపురం దాకా.. తడ నించి బెజవాడ దాకా.. జనసేన జెండా రెపరెపలాడాలి.. జనసేనాని జపం మారుమ్రోగాలి.. ” అంటూ వరుస ట్వీట్స్‌తో రచ్చ చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెలకొల్పిన జనసేన పార్టీ ఆవిర్భావ సభ రేపు (మార్చి 14న).. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం .. ఇప్పటం గ్రామంలో జరగనున్న సంగతి తెలిసిందే.
Also Read: Rashmika Mandanna: సమంత బాటలో నడవనున్న రష్మిక.? బీటౌన్‌లో చక్కర్లు కొడుతోన్న క్రేజీ న్యూస్..
Telugu Indian Idol: తెలుగు ఇండియన్ ఐడల్ ఎపిసోడ్ 6.. టాప్- 12 కంటెస్టెంట్లు ఎవరంటే..
Naga Babu: ఇకపై నా పూర్తి సమయాన్ని అందుకే వినియోగిస్తాను.. నెట్టింట్లో వైరలవుతోన్న నాగబాబు పోస్ట్..