Unstoppable 2: టాలీవుడ్‏లో ప్రస్తుతం మహానటి ఎవరు ?.. ఒకే పేరు రాసిన టాప్ ప్రొడ్యూసర్స్.. ఇంతకీ ఆమె ఎవరంటే..

|

Dec 03, 2022 | 4:04 PM

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లలో నెక్ట్స్ మహానటి ఎవరు ? అంటే చెప్పడం మాత్రం కష్టమే. ముఖ్యంగా సినీ ప్రియులు ఈ ప్రశ్నకు కన్ఫ్యూజ్ కావాల్సిందే. అయితే ఈ క్వశ్చన్ నందమూరి నటసింహం బాలయ్య అడిగితే ఎలా ఉంటుంది.

Unstoppable 2: టాలీవుడ్‏లో ప్రస్తుతం మహానటి ఎవరు ?.. ఒకే పేరు రాసిన టాప్ ప్రొడ్యూసర్స్.. ఇంతకీ ఆమె ఎవరంటే..
Unstoppable With Nbk 2
Follow us on

ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో వరుస సినిమాలతో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు పలువురు హీరోయిన్స్. ఓవైపు కొత్త హీరోయిన్స్ వస్తున్నా.. ఏమాత్రం తగ్గకుండా భారీ బడ్జెట్ చిత్రాలతో అగ్రకథానాయికలుగా దూసుకుపోతున్నారు. చేతినిండా సినిమాలతో రష్మిక మందన్నా, పూజా హెగ్డే, సమంత, నయనతార, శ్రుతి హాసన్ బిజీగా ఉండగా.. మరోవైపు కృతి శెట్టి, శ్రీలీల, కేతిక రాణిస్తున్నారు. అయితే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లలో నెక్ట్స్ మహానటి ఎవరు ? అంటే చెప్పడం మాత్రం కష్టమే. ముఖ్యంగా సినీ ప్రియులు ఈ ప్రశ్నకు కన్ఫ్యూజ్ కావాల్సిందే. అయితే ఈ క్వశ్చన్ నందమూరి నటసింహం బాలయ్య అడిగితే ఎలా ఉంటుంది. అది కూడా ఎన్నో దశాబ్దాలుగా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను నిర్మించిన బడా ప్రొడ్యూసర్లను. కానీ విచిత్రం ఏంటంటే.. ఆ ఇద్దరు నిర్మాతులు ఒకరికి తెలియకుండా మరొకరు.. ఒకే హీరోయిన్ పేరును రాశారు. దీంతో బాలయ్యే కాదు.. ప్రేక్షకులు సైతం ఆశ్చర్యపోయారు. ఇంతకీ అసలు ఏం జరిగిందో తెలుసుకుందామా.

బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 2 సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు నాలుగు ఎపిసోడ్స్ పూర్తైన ఈ షో.. తాజాగా ఐదవ ఎపిసోడ్ ప్రసారమయ్యింది. ఈ ఎపిసోడ్ కు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్ బాబు అతిథులుగా విచ్చేశారు. ఈ క్రమంలోనే వీరిద్దరితో సరదాగా మాట్లాడుతూ.. కావాల్సిన సమాధానాలు రాబట్టారు బాలయ్య. ఆ తర్వాత నెక్ట్స్ మహానటి ఎవరు ? అని అడగ్గా.. తమకు ఇచ్చిన చిన్న బోర్డులో అల్లు అరవింద్, సురేష్ బాబు ఒకరికి తెలియకుండానే.. మరొకరు హీరోయిన్ సమంత పేరు రాశారు. ముందుగా మీరు ఏ పేరు రాశారు అని సురేష్ బాబును అడగ్గా సమంత అని సమాధానమిచ్చారు.

ఇవి కూడా చదవండి

దీంతో పక్కనే ఉన్న అల్లు అరవింద్ కూడా అరే ఇద్దరం మాట్లాడుకోలేదు అంటూ తాను రాసిన సమంత పేరు చూపించారు. ప్రస్తుతం ఉన్నవాళ్లలో అవ్వగలిగితే సమంత మహానటి కాగలదు అని సురేష్ బాబు చెప్పుకొచ్చారు. ఇక ఈ టాప్ ప్రొడ్యూసర్స్ కామెంట్లతో సామ్ పేరు నెట్టింట మరోసారి వైరలవుతుంది. ఇటీవలే యశోద సినిమాతో సూపర్ హిట్ అందుకుంది.