
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. రష్మిక జంటగా నటిస్తున్న లెటేస్ట్ చిత్రం పుష్ప. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా… ప్రతినాయకుడి పాత్రలో మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ నటిస్తున్నారు. ఈ సినిమా కోసం బన్నీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, పుష్పరాజ్ ఇంట్రడక్షన్ వీడియోకు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. మునుపెన్నడూ చేయని వైవిద్యపాత్రలో నటిస్తున్నాడు బన్నీ. ముఖ్యంగా అల్లు అర్జున్ ఇందులో లారీ డ్రైవర్ పాత్రలో పూర్తిగా డీ గ్లామర్ లుక్‌లో కనిపించబోతుండటంతో అభిమానులు బన్నీని తెరపై చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ కు కరోనా సెకండ్ వేవ్ అడ్డుగా నిలిచింది. దీంతో షూటింగ్ వాయిదా పడింది. పాన్ ఇండియా లెవల్లో రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. ఈరోజు ఆయన బర్త్ డే సందర్భంగా.. పుష్ప అప్డేట్ ఇవ్వాలని బన్నీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా.. పోస్టులు పెడుతున్నారు. దీంతో మైత్రిమూవీ మేకర్స్.. దేవీ శ్రీప్రసాద్ పుష్ప సినిమమా కోసం కంపోజ్ చేసిన తొలి పాటను ఏ రోజున విడుదల తేదీని ప్రకటించారు. 5 భాషలు, 5 సింగర్స్, దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన సింగిల్ ట్యూన్‌ను ఆగస్ట్ 13న రిలీజ్ చేయనున్నట్లుగా ట్వీట్ చేశారు. హిందీలో ఈ పాటను విశాల్ దడ్లాని, కన్నడలో విజయ్ ప్రకాశ్, మలయాళంలో రాహుల్ నంబియార్,తెలుగులో శివం, తమిళంలో బెన్నీ దయాల్ పాటని ఆలపించారు. తెలుగులో దాక్కో దాక్కో మేక పేరుతో ఈ పాట రూపొందింది.
ట్వీట్..