ఈ బ్యూటీ రేంజే వేరబ్బా..! 50సెకండ్స్ యాడ్ కోసం ఏకంగా రూ. 5 కోట్లు డిమాండ్ చేసిన స్టార్ హీరోయిన్

|

Jan 14, 2025 | 5:04 PM

ఆమెను నటనకు.. అందానికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె నటించిన సినిమాలకు ఓ రేంజ్ క్రేజ్ ఉంటుంది. స్టార్ హీరోలు కూడా ఆమె డేట్స్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటుంది. అలాగే యాడ్స్ లోనూ నటిస్తుంది ఈ అమ్మడు.

ఈ బ్యూటీ రేంజే వేరబ్బా..! 50సెకండ్స్ యాడ్ కోసం ఏకంగా రూ. 5 కోట్లు డిమాండ్ చేసిన స్టార్ హీరోయిన్
Actress
Follow us on

ప్రస్తుతం సినిమా రేంజ్ మరిగిపోయింది. ఎక్కడ చూసిన పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తుంది. ప్రతి సినిమా వందకోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. అలాగే సినిమాల వసూళ్లు కూడా అదే రేంజ్ లో ఉంటున్నాయి. ఇప్పటికే పుష్ప సినిమా రూ. 18వందల కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. అలాగే చాలా సినిమాలు భారీ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. దాంతో హీరోలు కూడా భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. అలాగే కొంతమంది హీరోయిన్స్ కూడా భారీగానే రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. కొంతమంది బడా హీరోయిన్స్ హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటూ నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నారు. అలాగే ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్ ఒక్క యాడ్ కోసం ఏకంగా 5కోట్ల రెమ్యునరేషన్ తీసుకొని అందరికీ షాక్ ఇచ్చింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

ఇది కూడా చదవండి :Srihari: వాడు నా అయ్య..! శ్రీహరి నాన్న అని పిలిచే ఏకైక స్టార్ హీరో ఎవరో తెలుసా.?

కొంతమంది హీరోయిన్ భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. కొంతమంది భామలు సినిమాలతో పాటు పలు యాడ్స్ లోనూ నటిస్తూ రెండు చేతుల సంపాదిస్తున్నారు. అలాగే కోట్ల ఆస్తిపాస్తులు వెనకేసుకుంటున్నారు. అలాగే ఈ హీరోయిన్ 50 సెకండ్ల యాడ్ కోసం 5 కోట్లు తీసుకొని అందరూ ఆశ్చర్యపోయేలా చేసింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.. మరెవరో కాదు మన లేడీ సూపర్ స్టార్ నయనతార. నయన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

ఇది కూడా చదవండి : ఏంటీ..! మహేష్ బాబుతో ఉన్న ఈ చిన్నది ఇప్పుడు స్టార్ హీరోయినా.! అదికూడా తెలుగమ్మాయి

నయనతార ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తుంది. అలాగే రెమ్యునరేషన్ కూడా భారీగానే అందుకుంటుంది. అలాగే నయన్ పలు యాడ్స్ లోనూ నటించింది.ఒకొక్క సినిమాకు నయన్ రూ. 12 కోట్ల నుంచి రూ. 15 కోట్లవరకు వసూల్ చేస్తుంది. అలాగే ఇటీవల 50 సెకన్ల ప్రకటనకు 5 కోట్లు వసూలు చేసిందట. ఓ డీటీహెచ్ యాడ్ కోసం ఏకంగా రూ. 5కోట్లు అందుకుందట.

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి