
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో సంప్రదింపులు జరపడం కోసం తెలుగు చిత్ర పరిశ్రమ ప్రతినిధులు రేపు(మంగళవారం) సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు నారాయణ్ దాస్ నారంగ్, కార్యదర్శి దామోదర ప్రసాద్, నిర్మాతల మండలి అధ్యక్షుడు సి. కళ్యాణ్, కార్యదర్శి ప్రసన్నకుమార్, మా అసోసియేషన్ అధ్యక్షుడు నరేష్, కార్యదర్శి జీవిత, ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకటేష్, కార్యదర్శి దొరై, చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, ఆదిశేషగిరి రావు, సురేష్ బాబు, అల్లు అరవింద్,కె ఎస్ రామారావు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, దిల్ రాజు, సుధాకర్ రెడ్డి, ఎన్ వి ప్రసాద్, జెమిని కిరణ్ తదితరులు 20 మంది విజయవాడ బయలుదేరుతున్నాను. రేపు సాయంత్రం 3 గంటలకు ఈ సమావేశం జరగనుంది. బాలయ్యను ఈ మీటింగుకు ఆహ్వానించినప్పటికీ ఆయన జన్మదినం జూన్ 10 న ఉన్న కారణంగా రాలేకపోతున్నారని సి. కళ్యాణ్ తెలిపారు.
మరోవైపు తెలంగాణలో సినిమా, టీవీ షూటింగులకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. కొవిడ్-19 మార్గదర్శకాలు, లాక్‌డౌన్ రూల్స్ పాటించాలని పేర్కొంది. దీనికి సంబంధించిన ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాల్సి ఉన్నందున మూవీ థియేటర్స్ ప్రారభించడానికి టీఆర్ఎప్ సర్కార్ అనుమతి నిరాకరించింది.