17 నిమిషాల రేప్ సీన్‌తో కాంట్రవర్సీ.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ రికార్డులు బద్దలు.. ఇప్పుడు యూట్యూబ్‌లో ఫ్రీగా..

కొన్నేళ్ల క్రితం విడుదలైన ఈ సినిమాలో 17 నిమిషాల అత్యాచార సన్నివేశం ఉంది. దీంతో రిలీజ్ కు ముందే ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. నిషేధం డిమాండ్లు కూడా వినిపించాయి. అయితే ఎలాగోలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టేసింది.

17 నిమిషాల రేప్ సీన్‌తో కాంట్రవర్సీ.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ రికార్డులు బద్దలు.. ఇప్పుడు యూట్యూబ్‌లో ఫ్రీగా..
Cinema

Updated on: Mar 12, 2026 | 6:55 PM

నిజ జీవిత సంఘటనలు, ప్రముఖ వ్యక్తుల ఆధారంగా ఇప్పుడు సినిమాలు, వెబ్ సిరీస్ లు పెద్ద ఎత్తున తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఫేమస్ పర్సనాలిటీస్ జీవిత కథలను ఆధారంగా తీసుకుని ఓటీటీ సంస్థలు వెబ్ సిరీస్ లను తెరకెక్కిస్తున్నాయి. అయితే కొన్ని సార్లు ఈ రియల్ స్టోరీలు బాగా కాంట్రవర్సీ అవుతున్నాయి. ఈ మధ్యన విడుదలైన కొన్ని రియల్ స్టోరీలు, బయోపిక్ లు తీవ్ర వివాదాల్లో చిక్కుకున్నాయి. అయినా ఎలాగోలా ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలన విజయం సాధించాయి. అయితే ఇలాంటి కాంట్రవర్సీ సినిమాలు గతంలోనూ ఉన్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఒక రియల్ స్టోరీ. ఈ సినిమాలో చాలా జుగుప్సాకరమైన సన్నివేశాలు ఉన్నాయి. మోతాదుకు మించి హింస ఉంది. అన్నిటీకి మించి ఈ మూవీలో 17 నిమిషాల రేప్ సీన్ ఉండడంతో రిలీజ్ కు ముందే ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. సినిమాను నిషేధించాలన్న డిమాండ్లు కూడా వినిపించాయి. అయితే ఎలాగోలా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. అంతేకాదు జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది.

ఈ సినిమా పేరు బండిట్ క్వీన్.. బందిపోటు రాణిగా చరిత్రలో నిలిచిపోయిన పూలన్ దేవి జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో సీమా బిశ్వాస్ ఫూలన్ దేవి పాత్రను పోషించింది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు శేఖర్ కులభూషణ్ కపూర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 1994లో విడుదలైంది. అయితే, ఈ చిత్రంలో అత్యాచార సీన్స్, హింసాత్మక సన్నివేశాలు మోతాదుకు మించి ఉండడంతో ఈ సినిమాపై నిషేధం విధించారు. చివరకు ఫూలన్ దేవి కూడా ఈ సినిమాపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సినిమాను నిషేధించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని కూడా ఆమె హెచ్చరించింది. అయితే నిర్మాతలు మాట్లాడడంతో పూలన్ దేవి తలొగ్గింది.

 

ఇవి కూడా చదవండి

1994లో నిషేధించబడిన తర్వాత, ఈ చిత్రాన్ని 1996లో తిరిగి విడుదల చేశారు. CBFC ఈ చిత్రాన్ని ‘A’ సర్టిఫికెట్‌తో తిరిగి విడుదల చేయడానికి అనుమతించింది అలాగే కొన్ని హింసాత్మక సన్నివేశాలకు కత్తెర వేసింది. ఇక 17 నిమిషాల రేప్ సీన్స్ ను కూడా తగ్గించారు. రిలీజ్ తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. ఇదే చిత్రానికి గానూ సీమా బిశ్వాస్ ఉత్తమ నటిగా జాతీయ అవార్డును గెలుచుకోగా, నిర్మాతలు, దర్శకుడు శేఖర్ కపూర్ ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డును అందుకున్నారు. IMDb ప్రకారం, చందన్ థియేటర్‌లో మహిళల కోసం ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శన జరిగింది. సినిమాలోని కొన్ని షాకింగ్ సన్నివేశాలు చాలా మంది మహిళలు పురుషులతో కలిసి సినిమా చూడటానికి అసౌకర్యంగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. అడల్డ్ కంటెంట్ బండిట్ క్వీన్ సినిమా ఇప్పటికీ భారతీయ సినిమాల్లో అత్యంత సాహసోపేతమైన, అత్యంత ప్రభావవంతమైన చిత్రాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈ సినిమా యూట్యూబ్ లో ఫ్రీగా ఉంది. అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియోలోనూ అందుబాటులో ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Follow Us