
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలబ్రిటీలకు సంబంధించిన పాత జ్ఞాపకాలు, చిన్ననాటి ఫోటోలు నెట్టింట వైరల్ కావడం చాలా సాధారణం అయిపోయింది. ముఖ్యంగా తమ అభిమాన హీరో హీరోయిన్ల చిన్ననాటి చిత్రాలను చూసేందుకు నెటిజన్లు ఎప్పుడూ ఎంతో ఆసక్తి చూపుతుంటారు. తాజాగా టాలీవుడ్‌లో గ్లామర్ పాత్రలతో పాటు అద్భుతమైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఒక క్రేజీ హీరోయిన్ చిన్ననాటి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. ఆ ఫోటోలో ఉన్న చిన్నారిని చూసి మొదట్లో ఎవరూ ఆమెను ఇట్టే గుర్తుపట్టలేకపోతున్నారు. చాలా అమాయకమైన చూపులతో, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఉన్న ఆ చిన్నారి మరెవరో కాదు.. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి పూర్ అలియాస్ శమ్నా కాసిమ్. మలయాళీ ఇండస్ట్రీకి చెందిన ఆమె.. డ్యాన్సర్‌గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత వెండితైరపై తన అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇప్పుడు పూర్ణ చిన్ననాటి అరుదైన ఫోటో ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ ఫోటోను చూసిన అభిమానులు “చాలా క్యూట్‌గా ఉంది”, “అప్పట్లోనే ఎంత అందంగా ఉందో” అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ పిక్ ఇంటర్నెట్‌లో ట్రెండింగ్‌గా మారింది.
ఎక్కువ మంది చదివినవి : Soundarya : సౌందర్యతో 3 బ్లాక్ బస్టర్స్ చేశా.. ఆమె భర్త ఇప్పుడు ఏం చేస్తున్నారంటే.. టాలీవుడ్ హీరో కామెంట్స్..
సినిమాల పరంగానూ పూర్ణ ఎప్పుడూ బిజీగానే ఉంటున్నారు. పెళ్లి తర్వాత కూడా కుటుంబ జీవితాన్ని, సినిమా కెరీర్‌ను ఎంతో చక్కగా బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ పాత్రల్లోనూ తనదైన ముద్ర వేస్తున్న ఈ టాలెంటెడ్ బ్యూటీ, టీవీ షోలలో జడ్జ్‌గా కూడా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులకు చేరువయ్యారు. అంతేకాదు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ ద్వారా తెగ పాపులర్ అవుతున్నారు. ఇలా అప్పుడప్పుడు పంచుకునే పాత జ్ఞాపకాలు, చిన్ననాటి ఫోటోలు ఆమె అభిమానులకు ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాయి.
ఎక్కువ మంది చదివినవి : ఏముంటది మావ ఈ పాట.. 32 ఏళ్లుగా యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న లవ్ సాంగ్.. అప్పట్లో లవర్ కోసం తెగ పాడేవారు..
నటి పూర్ణ తెలుగులో శ్రీమహాలక్ష్మి (2007) సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సీమటపాకాయ్ (2011), అవును (2012) , అవును 2 (2015), రాజుగారి గది (2015), జయమ్ము నిశ్చయమ్ము రా (2016), అఖండ (2021) , అఖండ 2 (2025), దసరా (2023), గుంటూరు కారం (2024) వంటి చిత్రాల్లో నటించారు. అలాగే తమిళం, మలయాళం భాషలలో పలు చిత్రాల్లో నటించి మెప్పించారు.
ఎక్కువ మంది చదివినవి : Aamani: మా కాంబినేషన్ అంటే అప్పట్లో సూపర్ హిట్.. ఆ హీరోతో ఎక్కువ సినిమాలు చేశా.. ఆమని ..
ఎక్కువ మంది చదివినవి : Ramya Krishna : మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. ఆ పాటతోనే కృష్ణవంశీతో నా కనెక్షన్ మొదలైంది.. రమ్యకృష్ణ..