ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చిన రజనీ.. ట్రాన్స్‌జెండర్ పాత్ర చేయాలనుకుంటున్నా!

సూపర్ స్టార్ రజనీకాంత్‌కి ప్రపంచవ్యాప్తంగా మంచి స్టార్‌డమ్ ఉంది. 7 పదుల వయసులో కూడా ఆయన సినిమాలకి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ రజనీ సినిమా రిలీజ్ అవుతుందంటే.. కుర్ర హీరోలు కాస్త వెనక్కి తగ్గుతూంటారు. ఆయన స్టైల్‌, డైలాగ్స్‌, యాక్టింగ్ డిఫెరెంట్‌గా ఉంటాయి. తాజాగా ఆయన నటించిన సినిమా ‘దర్బార్’. ఈ సినిమా 2020 సంక్రాంతి పండుగకి విడుదల కానుంది. ఇందులో అరుణాచలం పాత్రలో నటిస్తున్నారు సూపర్ స్టార్. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన […]

  • Tv9 Telugu
  • Publish Date - 7:53 am, Tue, 17 December 19
ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చిన రజనీ.. ట్రాన్స్‌జెండర్ పాత్ర చేయాలనుకుంటున్నా!

సూపర్ స్టార్ రజనీకాంత్‌కి ప్రపంచవ్యాప్తంగా మంచి స్టార్‌డమ్ ఉంది. 7 పదుల వయసులో కూడా ఆయన సినిమాలకి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ రజనీ సినిమా రిలీజ్ అవుతుందంటే.. కుర్ర హీరోలు కాస్త వెనక్కి తగ్గుతూంటారు. ఆయన స్టైల్‌, డైలాగ్స్‌, యాక్టింగ్ డిఫెరెంట్‌గా ఉంటాయి. తాజాగా ఆయన నటించిన సినిమా ‘దర్బార్’. ఈ సినిమా 2020 సంక్రాంతి పండుగకి విడుదల కానుంది. ఇందులో అరుణాచలం పాత్రలో నటిస్తున్నారు సూపర్ స్టార్. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా.. ఒక రిపోర్టర్.. ఇంకా మీరు ఏదైనా కొత్త రోల్, జానర్‌లో నటించాలని అనుకుంటున్నారా..? అని అడగ్గా.. అందుకు ఆయన.. ఇప్పటి వరకూ నేను అన్ని పాత్రల్లో నటించా. నేను ఇండస్ట్రీకి వచ్చి 45 సంవత్సరాలు అవుతోంది.. దాదాపు 160 సినిమాలు చేశాను. కాబట్టి అన్ని నటించే ఉంటా.. కానీ ట్రాన్స్‌జెండర్ పాత్రలో మాత్రం నటించలేదు.. నాకు ఆ పాత్ర చేయాలని ఉంది అంటూ రజనీ సమాధానమిచ్చాడు. దీంతో అక్కడున్నవారంతా షాక్ అయ్యారు. అంత పెద్ద సూపర్ స్టార్.. ఈ పాత్ర చేయడమేంటని.. అవాక్కయ్యారు.

కాగా.. హీరోలు ట్రాన్స్‌జెండర్ పాత్రల్లో నటించడం కొత్తేమీ కాదు. లారెన్స్, శరత్ కుమార్, విజయ్ సేతుపతి, నరేష్ ఇలా తెలుగు, తమిళ హీరోలు చాలా మంది ఆ పాత్రల్లో నటించి మెప్పించారు.