అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

| Edited By:

Jul 19, 2020 | 11:35 AM

'తలా' అజిత్‌ ఇంట్లో బాంబు పెట్టినట్లు శనివారం చెన్నై కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్ కాల్ వెళ్లింది. ఈ క్రమంలో అప్రమత్తమైన నీలాంగరై పోలీసులు అజిత్‌ ఇంట్లో తనిఖీలు చేపట్టారు.

అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు
Follow us on

‘తలా’ అజిత్‌ ఇంట్లో బాంబు పెట్టినట్లు శనివారం చెన్నై కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్ కాల్ వెళ్లింది. ఈ క్రమంలో అప్రమత్తమైన నీలాంగరై పోలీసులు అజిత్‌ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. అలాంటి ఎలాంటి పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

కాగా విళుపురం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఈ పని చేసినట్లు పోలీసులు గుర్తించారు. గతంలోనూ పలువురు ప్రముఖుల ఇంటికి తరచూ ఈ వ్యక్తి బాంబు బెదిరింపులు చేసేవాడని వారు వెల్లడించారు. అంతేకాదు అతడు పలుమార్లు జైలుకు కూడా వెళ్లి వచ్చాడని, ప్రస్తుతం జామీనుపై బయటకు వచ్చి ఇలా చేసినట్లు పోలీసులు తెలిపారు. ఫోన్ నంబర్ ఆధారంగా బాంబు బెదిరింపునకు పాల్పడిన వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఇటీవల కాలంలో రజనీకాంత్‌, విజయ్ ఇళ్లకు సైతం బాంబు బెదిరింపు ఫోన్‌లు వచ్చిన విషయం తెలిసిందే.