Karan Mehra: పాపులర్ టీవీ యాక్టర్ కరణ్ మెహ్రా అరెస్ట్.. తనను కొట్టాడంటూ భార్య ఫిర్యాదు.. ఆ వెంటనే..

Karan Mehra: పాపులర్ హిందీ సిరీయల్ 'యే రిష్‏కా క్యా కెహ్లతా హై' నటుడు కరణ్ మెహ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు.

Karan Mehra: పాపులర్ టీవీ యాక్టర్ కరణ్ మెహ్రా అరెస్ట్.. తనను కొట్టాడంటూ భార్య ఫిర్యాదు.. ఆ వెంటనే..
Karan Mehra

Updated on: Jun 01, 2021 | 2:43 PM

Karan Mehra: పాపులర్ హిందీ సిరీయల్ ‘యే రిష్‏కా క్యా కెహ్లతా హై’ నటుడు కరణ్ మెహ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. గతరాత్రి భార్య నిషా రావల్ దాఖలు చేసిన ఫిర్యాదు పై కరణ్ ను అరెస్ట్ చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. అయితే ఆయనకు వెంటనే జూన్ 1న బెయిల్ మంజూరు అయ్యింది. కరణ్ మెహ్రా యే రిష్‏కా క్యా కెహ్లతా హై సిరీయల్ ద్వారా చాలా పాపులారిటీ సంపాదించుకున్నారు. వీరు ఆరు సంవత్సరాల వరకు రిలేషన్ షిప్ లో ఉన్న తర్వాత వీరిద్ధరు 2012లో వివాహం చేసుకున్నారు. వీరికి కవిష్ అనే నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. వీరిద్దరు జంటగా.. నాచ్ బలియే సీజన్ 5లో పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే ఎంతో అన్యోన్యంగా ఉంటున్న వీరి వైవాహిక జీవితంలో గత కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి.

సోషల్ మీడియాలో వీరిద్దరు విడిపోనున్నారని వార్తలు వచ్చాయి. అయితే వీటిపై నిషా కొద్ది రోజుల క్రితం స్పందించింది. తాము బాగున్నామని.. ఇలాంటి వార్తలను నమ్మకూడదు అంటూ చెప్పింది. అలాగే ఇటీవల కరోనా బారిన పడిన కరణ్ మెహ్రా కూడా.. క్లిష్ట పరిస్థితులలో తన భార్య నిషా ఎంతో ధైర్యం చెప్పిందని.. తనను చాలా జాగ్రత్తగా చూసుకుందని తెలిపారు. ఇక ఇటీవల వీరిద్ధరి మధ్య గొడవలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి వీరి మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో కరణ్ తన తలను గోడకు నెట్టేసినట్లు నిషా తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కరణ్ పై సెక్షన్స్ 336, 337, 332,504, 506 కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముంబైలోని అతని ఇంట్లో అరెస్ట్ చేశారు. Nisha Rawal

ఇక కరణ్ మెహ్రా భార్య నిషా రావల్ కూడా పాపులర్ నటి కమ్ మోడల్. ఈమె కోకా కోలా, సన్ సిల్క్ షాంపూలతోపాటు పలు టీవీ యాడ్స్ లో కనిపించింది. అంతేకాదు… కొన్ని బాలీవుడ్ సినిమాల్లో నటించింది.

Also Read: Prabhas: యంగ్ రెబల్ స్టార్ కోసం మరో బాలీవుడ్ డైరెక్టర్.. పాన్ ఇండియా ప్రాజెక్ట్‏లో ప్రభాస్ పాత్ర అదేనా..

బిగ్‏బాస్‏లోకి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గర్ల్ ఫ్రెండ్ ?.. కంటెస్టెంట్స్ లిస్ట్ రెడీ చేస్తోన్న నిర్వాహకులు.. ఎవరెవరంటే..

Loading...
Unable to load recommendations.
Follow Us