Jabardasth Sai Teja: సాయి తేజ నుంచి ప్రియాంక సింగ్‌గా మారడానికి పెద్ద యుద్ధమే చేశా.. తండ్రి అంధుడు.. చూసేవారు లేరంటూ..

Jabardasth Sai Teja Converted As Transgender: మనల్ని నవ్విస్తూ సంతోషంగా కనిపించేవారందరి నిజ జీవితం కూడా అలాగే సంతోషంగా ఉందని భావించడానికి లేదు..

Jabardasth Sai Teja: సాయి తేజ నుంచి ప్రియాంక సింగ్‌గా మారడానికి పెద్ద యుద్ధమే చేశా.. తండ్రి అంధుడు.. చూసేవారు లేరంటూ..
Jabardasth Sai Teja

Updated on: Oct 14, 2021 | 8:11 PM

Jabardasth Sai Teja Converted As Transgender: మనల్ని నవ్విస్తూ సంతోషంగా కనిపించేవారందరి నిజ జీవితం కూడా అలాగే సంతోషంగా ఉందని భావించడానికి లేదు.. ఆ నవ్వులను మనకి పంచె ఆ వ్యక్తి జీవితం తరచి చూస్తే కన్నీటి మయం అవ్వొచ్చు..ముఖ్యంగా జబర్దస్త్ షో తో గుర్తింపు తెచ్చుకున్న అనేక మంది కమెడియన్స్ నిజజీవితం కన్నీటి మయం అని పలు సందర్భాల్లో తెలుసుకున్నాం కూడా.. తాజాగా జబర్దస్త్ లో లేడీ గేటప్ తో కమెడియన్ గా గుర్తింపు దక్కించుకున్న సాయి తేజ జీవితంలో పడిన కష్టాలు… అబ్బాయి నుంచి అమ్మాయిగా మారినప్పుడు తాను ఎదుర్కొన్న కష్టాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

సాయి తేజ నుంచి ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ గా మారింది. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 5 లో సందడి చేస్తోంది. తన ప్రవర్తన తో మాట తీరుతో ట్రాన్స్ జెండర్ మీద చాలా మంది వ్యక్తం చేసే అభిప్రాయాలను చెరిపేసిందని చెప్పవచ్చు.    ముందు సీజన్ లో ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రికి భిన్నంగా ఉంది ప్రియాంక సింగ్అం నడవడిక. హౌస్ద లో ఉన్న అందరితోనూ మంచిగా ఉంటూ.. మంచి రిలేషన్ ని మెయింటేన్ చేయడానికి ప్రయత్నిస్తుంది.  సభ్యుల పట్ల కేరింగ్ చూపిస్తుంది.  దీంతో ప్రియాంక సింగ్ ను బిగ్ బాస్ ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు.

ఆయితే సాయి తేజ వ్యక్తిగత జీవితానికి వస్తే.. శ్రీకాకుళం జిల్లా.. తండ్రి ఓ యాక్సిడెంట్ లో కళ్ళు పోయాయి. కుటుంబ బాధ్యతలను తీసుకోవాల్సిన అన్నలు, చెల్లెల్లు బాధ్యత వదిలేస్తే.. తాను తల్లిదండ్రుల బాధ్యతను తీసుకున్నాడు. తనలో ఉన్న అమ్మాయి లక్షణాలను గుర్తించిన సాయి తేజ.. మొదట ట్రాన్స్ జెండర్ గా మారిన విషయంను కుటుంబంలో  తెలియకుండా జాగ్రత్త పడిందట.  తాను అమ్మాయిగా మారిన విషయం బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాతే తండ్రికి తెలిసిందని ప్రియాంకా సింగ్ చెప్పింది. ట్రాన్స్ జెండర్ గా మారడం వెనుక చాలా పెద్ద యుద్దమే జరిగిందని ప్రియాంక చెప్పుకొచ్చింది. పెద్దమ్మ తల్లి ఆశీర్వాదంతో నే తాను ఇలా అమ్మాయిగా మారినట్లు చెప్పడమే కాదు.. ప్రియాంక జీవితం ప్రేక్షకుల కంట కన్నీరు తెప్పించింది. బిగ్ బాస్ తర్వాత తనకు అవకాశాలు వస్తే.. సినిమాల్లో నటించాలనే కోరిక ఉందని చెప్పింది ప్రియాంక సింగ్ .

Also Read:  విద్యుత్ వైర్ల మధ్య చిక్కుకున్న పావురం.. డ్రోన్‌కు కత్తి కట్టి రక్షించిన పోలీసులు .. వీడియో వైరల్