RRR: సల్మాన్‏కు నాటు నాటు స్టెప్పులు నేర్పిన తారక్, చరణ్.. బిగ్‏బాస్ వేదికపై ఆర్ఆర్ఆర్ రచ్చ..

ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరు స్టార్ హీరోలతో జక్కన్న చేసిన

RRR: సల్మాన్‏కు నాటు నాటు స్టెప్పులు నేర్పిన తారక్, చరణ్.. బిగ్‏బాస్ వేదికపై ఆర్ఆర్ఆర్ రచ్చ..
Rrr

Updated on: Dec 26, 2021 | 5:46 PM

ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరు స్టార్ హీరోలతో జక్కన్న చేసిన మ్యాజిక్ చూసేందుకు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తుండడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎప్పుడు పిరియాడిక్ చిత్రాల జోలికి వెళ్ళని జక్కన్న చరిత్రలో ఎప్పుడు కలవని ఇద్దరు వీరులను ఓకే స్క్రీన్ పై చూపించబోతుండడంతో ఆర్ఆర్ఆర్ సినిమా పై మరింత క్యూరియాసిటీ నెలకొంది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. గత కొద్ది రోజుల నుంచి ప్రమోషన్స్ బిజీలో ఉన్నారు తారక్, చరణ్, జక్కన్న. నేషనల్ వైడ్ ప్రమోషన్స్ చేస్తున్నారు ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్. ఈక్రమంలోనే ఇటీవల పాపులర్ షో కపిల్ శర్మ షోలో సందడి చేసిన ఆర్ఆర్ఆర్ టీం ఇప్పుడు బుల్లితెరపై అత్యంత పెద్దదైన రియాల్టీ షో బిగ్‏బాస్ వేదికపై అలరించారు.

హిందీలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ షోకు వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ షోలో తారక్, చరణ్, రాజమౌళి, అలియభట్ ముఖ్య అతిథులుగా వెళ్లారు. బిగ్‏బాస్ షోలో సల్మాన్ ఖాన్‏కు నాటు నాటు సాంగ్ స్టెప్పులను నెర్పించారు. అలియా భట్, రాజమౌళి, చరణ్, ఎన్టీఆర్‏తో సల్మాన్ ఖాన్ సైతం నాటు నాటు పాటకు స్టెప్పులేసి అలరించారు. అనంతరం సల్మాన్ ఖాన్ పుట్టిన రోజు వేడుకలను ముందుగానే బిగ్‏బాస్ వేదికపై జరిపించారు ఆర్ఆర్ఆర్ టీం. ఇందుకు సంబంధించిన, ఫోటోస్, వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ దానయ్య నిర్మిస్తుండగా.. అలియా భట్, ఒలివియా మోరీస్, అజయ్ దేవగణ్, శ్రియ కీలకపాత్రలలో నటిస్తున్నారు.

ట్వీట్..

 

Also Read:  Ram Gopal Varma: ఇదేంది సామీ.. కేక్‏ను ఇలా కట్ చేస్తారా.. వర్మ రచ్చ మాములుగా లేదుగా..

Naveen Polishetty: అఫీషియల్ అనౌన్స్‎మెంట్ వచ్చేసిందిగా.. యూవీ బ్యానర్‏లో నవీన్ పోలిశెట్టి సినిమా.. హీరోయిన్ ఎవరంటే..

Rakul Preet Singh: హ్యాపీ బర్త్ డే మై సన్‌షైన్.. ప్రియుడికి స్వీట్‌గా బర్త్‌ డే విషెస్‌ చెప్పిన పంజాబీ బ్యూటీ..

2022 Mega Heros Movies: కొత్త ఏడాదిలో ఫ్యాన్స్‌కు మెగా హీరోల బోనాంజా.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు రిలీజ్..

 

Loading...
Unable to load recommendations.
Follow Us