Karan Mehra: బుల్లితెర నటుడు కరణ్ మెహ్రా పై మరోసారి కేసు నమోదైంది. తనకు తెలియకుండా… తన అకౌంట్ నుంచి రూ. కోటి విత్ డ్రా చేసాడని… అతని భార్య ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. డబ్బులు విత్ డ్రా చేయడం గురించి తనకు ఏమి తెలియదని… ఆమె శుక్రవారం రాత్రి గోరేగావ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో.. అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి టీవీ నటుడు, అతని ఇద్దరు కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉంటే.. కరణ్ మెహ్రా పై నిషా పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇది రెండోసారి. ఈ ఏడాది మే 31న తనపై దాడి చేసాడని… నిషా గోరేగావ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కరణ్ మెహ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఆ తర్వాత అతనికి బెయిల్ లభించింది. వీరి వివాహాం జరిగి 8 సంవత్సరాలు అవుతుండగా.. వీరికి 4 సంవత్సరాల బాబు ఉన్నారు. అయితే వీరిద్ధరి మధ్య కొద్ది రోజులుగా మనస్పర్థలు వస్తున్నాయని సమాచారం. నిషా ప్రవర్తన సరిగా ఉండదని… చాలా దూకుడుగా వ్యవహరిస్తుందని ఇటీవల కరణ్ ఓ ఇంటర్వ్యూలో పేర్కోన్నాడు. తనకు కోపం వచ్చినప్పుడు అందరిపై దాడి చేస్తుందని… ఇంట్లో వస్తువులను పగలగొడుతుందని తెలిపారు. తన భార్య ప్రవర్తనతో ఓసారి తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు తెలిపారు.