Tollywood: ఒకప్పుడు రూ.50లకు పెళ్లిళ్లల్లో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు స్పెషల్ పాటలకు చాలా ఫేమస్..

|

Dec 26, 2024 | 5:43 PM

ఇండస్ట్రీలో స్పెషల్ సాంగ్స్‏కు ఆమె కేరాఫ్ అడ్రస్. ఒకప్పుడు ఎన్నో పాటలకు రొమాంటిక్ స్టెప్పులతో అదరగొట్టేసింది. ఆ తర్వాత పలు రియాల్టీ షోలలో పాల్గొంది. కానీ ఈ అమ్మడుకు సినిమాల్లో ఆఫర్స్ తగ్గిపోయాయి. దీంతో సోషల్ మీడియాలో వరుస పోస్టులు చేస్తూ ఫాలోవర్లను పెంచుకుంది.

Tollywood: ఒకప్పుడు రూ.50లకు పెళ్లిళ్లల్లో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు స్పెషల్ పాటలకు చాలా ఫేమస్..
Rakhi Sawant
Follow us on

సినీరంగంలో ఆమె చాలా ఫేమస్. నటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో కలలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అలాగే తక్కువ సమయంలోనే వచ్చిన స్టార్ డమ్ కాపాడుకోవాలంటే ఎన్నో సవాళ్లను ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఓ తార.. నిత్యం పర్సనల్ విషయాలతో.. వివాదాస్పద వార్తలలో నిలుస్తుంది. అప్పట్లో 50 రూపాయాలకు పెళ్లిళ్లల్లో ఫుడ్ సర్వర్ గా పనిచేసిన ఆ అమ్మాయి.. ఆ తర్వాత ఇండస్ట్రీలో స్పెషల్ పాటలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఒకే ఒక్క పాటతో ఇండస్ట్రీలో పాపులర్ అయిన ఆ అమ్మాయి… ఆతర్వాత చేతినిండా సినిమాలతో బిజీ అయ్యింది. కానీ ఆ తర్వాత ప్రేమ, పెళ్లి చిన్నాభిన్నం చేశాయి. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసా.. ? తనే రాఖీ సావంత్. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె చాలా ఫేమస్. ఎప్పుడూ ఏదోక విషయంతో వార్తలలో ఉంటుంది.

పదేళ్ల వయసు నుంచి ఉద్యోగం చేయడం స్టార్ట్ చేసిందట రాఖీ సావంత్. కుటుంబంలో నెలకొన్న ఆర్థిక కష్టాలను అధిగమించేందుకు వచ్చిన ప్రతి ఉద్యోగాన్ని చేసింది. ముంబైలోని ఓ క్యాటరింగ్‌ సర్వీస్‌లో ఫుడ్ సర్వర్ గా పనిచేశానని.. అప్పుడు తనకు రూ.50 జీతం ఇచ్చేవారని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది రాఖీ సావంత్. అదే సమయంలో తనకు నటనపై ఆసక్తి ఏర్పడడంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందట. తాను సినిమాల్లోకి రావడం తన తల్లిదండ్రులకు ఇష్టం లేదని.. కానీ అవేం పట్టించుకోకుండానే సినీరంగంలోకి వచ్చినట్లు చెప్పుకొచ్చింది. కాలేజీ చదువు పూర్తయ్యాక సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన తనకు ప్రతిచోట నిరాశే ఎదురయ్యిందని చెప్పుకొచ్చింది.

Rakhi Sawant News

తన శరీరం, ముఖం గురించి ఎన్నో అవమానాలు ఎదురయ్యాయని.. దీంతో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నానని తెలిపింది. ఆ తర్వాత తనకు వరుస ఆఫర్స్ వచ్చాయట. 1997లో అగ్ని చక్ర సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. జోరుకా గులాం, యే రాస్తే హై ప్యార్ కే, చుర్రా లియా హై తుమ్నే వంటి చిత్రాల్లో నటించింది. హిందీలో అనేక సినిమాల్లో స్పెషల్ సాంగ్స్, ప్రైవేట్ ఆల్బమ్స్ చేసింది. 2006లో బిగ్ బాస్ మొదటి సీజన్ లో పాల్గొంది. అప్పుడు టాప్ 4గా నిలిచింది. 2015లో మరోసారి బిగ్ బాస్ షోలోకి అడుగుపెట్టింది. ఇక రాఖీ సావంత్ జీవితంలో ప్రేమ, పెళ్లి కలిసి రాలేదు. రెండుసార్లు పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంది. ప్రస్తుతం రాఖీ సావంత్ సినిమాలకు దూరంగా ఉంటుంది.

ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‏బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..

Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‏గా..

Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‏ను మించిన అందం.. ఎవరంటే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.