Mandya Ravi: సినీ పరిశ్రమలో మరో విషాదం.. అనారోగ్యంతో ప్రముఖ నటుడు మృతి..

కన్నడలోనే కాకుండా తెలుగు, తమిళ భాషలలో పలు సీరియల్స్‏లో నటించారు. రవి ప్రసాద్ మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. డైరెక్టర్ టీఎన్ సీతారాం తెరకెక్కించిన అనేక సీరియల్స్‏లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు రవిప్రసాద్.

Mandya Ravi: సినీ పరిశ్రమలో మరో విషాదం.. అనారోగ్యంతో ప్రముఖ నటుడు మృతి..
Mandya Ravi

Updated on: Sep 15, 2022 | 11:59 AM

కన్నడ టీవీ నటుడు మాండ్య రవి (Mandya Ravi).. అలియాస్ రవిప్రసాద్ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా మల్టీపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ సమస్యతో బాధపడుతున్న ఆయన బెంగుళూరులోని బీజీఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. 42 ఏళ్ల మాండ్య రవికి భార్య ఒక కుమారుడు ఉన్నారు. ఫేమస్ రచయిత డాక్టర్ హెచ్ఎస్ ముద్దెగౌడ కుమారుడే ఈ మాండ్య రవి. కన్నడలోనే కాకుండా తెలుగు, తమిళ భాషలలో పలు సీరియల్స్‏లో నటించారు. రవి ప్రసాద్ మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. డైరెక్టర్ టీఎన్ సీతారాం తెరకెక్కించిన అనేక సీరియల్స్‏లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు రవిప్రసాద్.

డైరెక్టర్ టీఎస్ నాగాభరణ తెరకెక్కించిన మహామయి సిరీయల్ ద్వారా అరంగేట్రం చేసిన రవిప్రసాద్.. మించు, ముక్కత ముక్త, చిత్రలేఖ, యశోదే, వరలక్ష్మీ వంటి సీరియల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన అకాల మరణం పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్ర్బాంతికి గురయ్యారు.

ఇవి కూడా చదవండి

ట్వీట్స్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us