బిగ్బాస్ సీజన్ 5.. కంటెస్టెంట్స్ వ్యక్తిగత జీవితాలపై ఎక్కువగా ఎఫేక్ట్ అయింది. ముఖ్యంగా రెండు జంటల మధ్య బిగ్బాస్ (Bigg Boss) చిచ్చు పెట్టిన సంగతి తెలిసిందే. యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్.. దీప్తి సునయన ఐదేళ్ల బంధానికి బ్రేకప్ చెప్పారు. అయితే వీరిద్దరూ మళ్లీ కలుస్తారంటూ నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక మరో జంట సిరి (Siri), శ్రీహాన్ (Srihan) కూడా విడిపోతున్నారంటూ టాక్ నడుస్తోంది.
అందుకు తగినట్టుగానే బిగ్బాస్ అనంతరం సిరి, శ్రీహాన్ కలిసి కనిపించలేదు. అలాగే.. ఒకరినొకరు అన్ ఫాలో అవ్వడం.. సిరి బర్త్ డే రోజున శ్రీహాన్ శుభాకాంక్షలు చెప్పిన సిరి స్పందించకపోవడం.. బ్రేకప్ వార్తలకు మరింత బలం చేకురింది. అయితే ఈ వార్తలపై సిరి, శ్రీహాన్లు స్పందించలేదు.
తాజాగా ఒక్క ఫోటోతో బ్రేకప్ రూమర్లకు ఫుల్ స్టాప్ పెట్టారు సిరి, శ్రీహాన్. తాజాగా సిరి తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేసిన ఫోటోతో బ్రేకప్ వార్తలకు ముగింపు పలికింది. ఇటీవల వీరిద్దరు కలిసి యాంకర్ రవి కుటుంబాన్ని కలిశారు. వీరంతా కలిసి ఓ రెస్టారెంట్లో భోజనం చేసి సందడి చేశారు. ఆ సమయంలో వీరంతా కలిసి దిగిన ఫోటోలను యాంకర్ రవి భార్య నిత్య సక్సేనా తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ.. మీ ఇద్దరిని కలవడం చాలా సంతోషంగా ఉందంటూ పోస్ట్ చేసింది. ఇందుకు సిరి కూడా హ్యాప్పీ అంటూ స్పందించింది. దీంతో ఇన్ని రోజులుగా నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న బ్రేకప్ వార్తలకు ఎండ్ కార్డ్ పడింది. ఈ పోస్ట్ పై నెటిజన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Mahesh Babu: బుర్జ్ ఖలీఫాపై మహేష్ స్టంట్ .. ఆకట్టుకుంటున్న సూపర్ స్టార్ న్యూ యాడ్..
Rajasekhar: మీ ఆశీస్సుల వల్లే బతికున్నాను.. శేఖర్ సినిమా సాంగ్ లాంఛ్లో రాజశేఖర్ భావోద్వేగం..