Bigg Boss 9 Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ బయటకు.. టాప్ 5 వీళ్లే..

బిగ్ బాస్ సీజన్ 9 ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం హౌస్ లో సెకండ్ ఫైనలిస్ట్ కోసం టాస్కులు జరుగుతున్న సంగతి తెలిసింద. ఇప్పుడు హౌస్ లో సుమన్ శెట్టి, భరణి, సంజన, తనూజ, కళ్యాణ్ పడాల, డీమాన్ పవన్, ఇమ్మాన్యూయేల్ ఉన్న సంగతి తెలిసిందే.

Bigg Boss 9 Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ బయటకు.. టాప్ 5 వీళ్లే..
Bigg Boss

Updated on: Dec 13, 2025 | 3:31 PM

బిగ్ బాస్ సీజన్ 9 మరికొన్ని రోజుల్లో విజేత ఎవరనేది తెలియనుంది. ఇప్పుడు ఈ షో చివరి వారానికి వచ్చేసింది. వచ్చే ఆదివారం బిగ్ బాస్ సీజన్ 9కు ఎండ్ కార్డ్ పడనుంది. మొన్నటివరకు టాప్ 5 కంటెస్టెట్స్ ఎవరా అనే ఆసక్తి ఉండేది. అలాగే టైటిల్ రేసులో కళ్యాణ్, తనూజ పోటాపోటీగా దూసుకుపోతున్నారు. కానీ ఈవారం ఆట తీరుతో టైటిల్ రేసులోకి దూసుకొచ్చాడు ఇమ్మాన్యుయేల్. ముఖ్యంగా సంజనతో ఇమ్మూ బాండింగ్ మధ్య దూరం రావడం కూడా ప్రధాన కారణం అని చెప్పొచ్చు.

ప్రస్తుతం నామినేషన్లలో ఆరుగురు కంటెస్టెంట్స్ ఉండగా.. ఈసారి కళ్యాణ్ సైతం నామినేషన్లలో లేకపోవడంతో అత్యధిక ఓటింగ్ తో టాప్ లో ఉంది తనూజ. సోషల్ మీడియా లెక్కలు చూస్తుంటే తనూజకు 26 శాతం ఓటింగ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఆమె తర్వాతి స్తానంలో ఇమ్మాన్యుయేల్ ఉన్నాడు. ఆ తర్వాత డీమాన్ పవన్, భరణి, సంజన, సుమన్ శెట్టి తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ఇవి కూడా చదవండి : Actress Vahini : అప్పుడు సీరియల్స్‏తో క్రేజ్.. క్యాన్సర్‏తో పోరాటం.. సాయం కోరుతూ పోస్ట్..

అయితే ఈ వారం డేంజర్ జోన్ లో సుమన్ శెట్టి, సంజన ఉన్నట్లు ముందు నుంచి ప్రచారం జరిగింది. టాప్ 5లో ఐదుగురు మాత్రమే ఉండాలి కాబట్టి.. ఈ వారం డబులు ఎలిమినేషన్ ఉండనుంది. వీరిలో అతి తక్కువ ఓటింగ్ రావడంతో సంజన, సుమన్ శెట్టి ఎలిమినేట్ అవుతారని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఊహించని ఎలిమినేషన్ జరిగినట్లుగా తెలుస్తోంది. గతవారం ఓటింగ్ తో సంబంధం లేకుండా రీతూను బయటకు పంపించారు. ఇక ఇప్పుడు కూడా అదే జరిగినట్లు సమాచారం. తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతున్న టాక్ ప్రకారం ఈ వారం సుమన్ శెట్టితోపాటు స్ట్రాంగ్ కంటెస్టెంట్ భరణి సైతం ఎలిమినేట్ అయ్యారని తెలుస్తోంది. నిజానికి భరణికి సంజన కంటే ఎక్కువ ఓటింగ్ ఉంది.. కానీ ఇప్పుడు ఊహించని విధంగా భరణి బయటకు వచ్చినట్లు సమాచారం. ఇది ఎంతవరకు నిజమనేది తెలియాలంటే ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi : చిరంజీవితో మూడు సినిమాల్లో ఛాన్స్.. ఆ కారణంతోనే చేయలేకపోయాను.. హీరోయిన్..

Loading...
Unable to load recommendations.
Follow Us