Bigg Boss Telugu: బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌కు హోస్టుగా నాగార్జున తప్పుకున్నారా..? ఆయన స్థానంలో యంగ్‌ హీరో..?

|

Jun 30, 2021 | 5:39 AM

Bigg Boss Telugu: తెలుగు బిగ్‌బాస్‌ రియాలిటీ షో.. ఇది తెలుగు ప్రజలకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఈ షోకు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆకర్షితులయ్యారు. ఇప్పటికే నాలుగు..

Bigg Boss Telugu: బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌కు హోస్టుగా నాగార్జున తప్పుకున్నారా..? ఆయన స్థానంలో యంగ్‌ హీరో..?
Bigg Boss 5
Follow us on

Bigg Boss Telugu: తెలుగు బిగ్‌బాస్‌ రియాలిటీ షో.. ఇది తెలుగు ప్రజలకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఈ షోకు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆకర్షితులయ్యారు. ఇప్పటికే నాలుగు సీజన్లు ముగిశాయి. ఇక ఐదో సీజన్‌ ప్రారంభించేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. తెలుగులో బిగ్‌బాస్‌ షోకు సీజన్‌ సీజన్‌కు ఆదరణ పెరుగుతోంది. ఇప్పటికే ఐదో సీజన్‌ ప్రారంభించాల్సి ఉండగా, కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. అయితే ఈ సీజన్‌కు సంబంధించి కంటెస్టెంట్ల ఎంపిక కూడా తుది దశకు చేరుకుందని తెలుస్తోంది. బిగ్‌బాస్‌ -4 గత ఏడాది డిసెంబర్‌లో ముగిసిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ సమయంలో ఇళ్లకే పరిమితమైన వారికి మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చింది. అయితే గత సీజన్‌లో అంతా కొత్త ముఖాలే అయినప్పటికీ.. హోస్టుగా నిర్వహించిన నాగార్జున షోను రక్తి కట్టించాడు. ఇదిలా ఉండగా, ఈ ఐదో సీజన్‌ షోకు సంబంధించిన ఓ షాకింగ్‌ న్యూస్‌ బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌కు నాగార్జున హోస్టుగా నిర్వహించడం లేదని, ఆయన స్థానంలో టాలీవుడ్‌ యంగ్‌ హీరో రానా దగ్గుబాటి వ్యవహరించబోతున్నారని సమాచారం.

గత రెండు సీజన్‌లకు హోస్టుగా వ్యవహరించిన నాగార్జున ఐదో సీజన్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇక నాగ్‌ తప్పుకోవడంతో బిగ్‌బాస్‌ నిర్వాహకులు పలువురు యంగ్‌ హీరోలను సంప్రదించారని తెలుస్తోంది. ఈ క్రమంలో రానా దగ్గుబాటిని ఫైనల్‌ చేశారట. రానా గతంలో ‘నెంబర్‌ వన్‌ యారీ’అనే షోకి హోస్ట్‌గా వ్యవహరించాడు. ఆ అనుభవంలోనే బిగ్‌బాస్‌ 5 సీజన్‌కు ఒప్పుకొన్నట్లు తెలుస్తోంది. అయితే మొదటి నుంచి ఈ తెలుగు బిగ్‌బాస్‌ షోలపై ఎన్నో వార్తలు బయటకు లీకవుతున్నాయి. మరి ఇలాంటి వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే బిగ్‌ బాస్‌ నిర్వాహకుల నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.

ఇవీ కూడా చదవండి:

Kangana Ranaut : కంగనా రనౌత్ పాస్‌పోర్ట్ రెడీ..! త్వరలో ‘ధాకాడ్’ చిత్రీకరణ కోసం విదేశాలకు..

David Warner: ‘ఆర్ఆర్ఆర్’ పోస్టర్‏ను వదలని డేవిడ్ వార్నర్.. ఈసారి తోడుగా సన్ రైజర్స్ కెప్టెన్ కూడా… ఫోటో వైరల్..