బిగ్‌బాస్ సీజన్ 5 రోజు రోజూకీ ఆట రసవత్తరంగా మారుతుంది. గత సీజన్లకు భిన్నంగా ఈసారి మొదటి నుంచే గొడవలు, ఏడుపులు, అరుపులతో రచ్చ చేస్తున్నారు కంటెస్టెంట్స్. ఒకరికి ఒకరికి ఎక్కడా తగ్గాబోము అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇక మొన్నటి ఎపిసోడ్‌లోని నామినేషన్ ప్రక్రియలో రెచ్చిపోయి మరి ఓవర్ యాక్షన్ చేసేసారు. ఒకరిపై ఒకరు అరుస్తూ.. ఏడుస్తూ.. ఇంట్లో నానా హంగామా సృష్టించారు. ఇక నిన్న (సెప్టెంబర్ 14న) కూడా ఇంట్లో మరోసారి రచ్చ చేశారు కంటెస్టెంట్స్. ఆడ, మగా అనే తేడా లేకుండా బిహేవ్ చేశారు.
ఇక నిన్నటి ఎపిసోడ్లో నటరాజ్ మాస్టర్ గుంటనక్క అంటూ మాట్లాడంపై రవి స్పందిస్తాడు… మీరెందుకు అంతలా ఉహించుకుంటున్నారు మాస్టర్ ? అని రవి ప్రశ్నించగా.. నిన్నటి ఓట్లు ఎలా పడ్డాయో నాకు తెలుసు. నేను ఉహించుకోవడం లేదు అంటాడు మాస్టర్. మీరు దేవుడిలా మాట్లాడితే.. ఇంకేం చెయ్యాలి మాస్టర్.. మీరు దేవుడు.. మీరు తోపు, తురుము నాకు తెలుసు.. ప్రూఫ్ ఉంది కదా మీకు నేనే ఎక్కిస్తున్నాను అని? నాతో చక్కగా మాట్లాడరెందుకు మాస్టర్..? అంటూ రవి వాదిస్తుండగా.. మరోవైపు లోబో, మానస్ మధ్య ఆసక్తికరమైన చర్చ నడుస్తూ ఉంటుంది.
ఇక మరుసటి రోజు ఉదయాన్నే ముక్కాలా.. ముక్కాబులా సాంగ్‌తో నిద్రలేచిన కంటెస్టెంట్స్ తమదైన స్టెప్పులతో అలరించారు. ఇక ఆ తర్వాత ఉమాదేవితో సన్నీ ప్రేమగా మాట్లాడు.. అలా కోపంగా మాట్లాడకు.. ఇంట్లో కోపం, ప్రేమ రెండు ఉండాలని సలహా ఇస్తుంటాడు. దీంతో ఉమా మరోసారి రెచ్చిపోయింది. నేను ఇలాగే ఉంటా.. ఎవరితోనైనా ఇలాగే మాట్లాడతాను అంటూ తెల్చిచెప్పింది. మా ఇంట్లో నా చెల్లి, నా మొగుడితో అయినా కూడా ఇలాగే మాట్లాడతాను అంటూ రివర్స్ కౌంటర్ ఇస్తుంది ఉమా. దీంతో ఈ ఇంట్లో అందరూ ఒకేలా ఉండరు. ఒక్కోక్కరు ఒక్కోలా ఉంటారు అంటూ సన్నీ అనగా..తన మెంటాలిటీ ఇంతే అని.. ఇష్టం ఉంటే అంగీకరిస్తారు… లేదంటే లేదు అంటూ వరుసగా కౌంటర్స్ వేస్తుంది. మొత్తానికి ఈసారి సన్నీగా స్ట్రాంగ్‌గానే సమాధానాలు చెప్పింది ఉమా.
Also Read: Bigg Boss 5 Telugu: బిగ్ బాస్‌ను బ్యాన్ చేయాలి.. అది సమాజానికి ఓ చీడ పురుగులాంటిదన్న సీపీఐ నారాయణ..
Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో గుంటనక్క ఎవరో సన్నీకి క్లారిటీ ఇచ్చిన నటరాజ్ మాస్టర్..!