బుల్లితెరపై యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రవి. చాలా షోల్లో తన మాటలతో కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు యాంకర్ రవి. ఆ తర్వాత హీరోగానూ ట్రై చేశాడు. అయితే వెండి తెర కంటే బుల్లితెర పైనే ఎక్కువ పాపులారిటీ సొంతం చేసుకున్నాడు రవి. ఇక నాగార్జున హోస్ట్‌గా టెలికాస్ట్ అవుతున్న బిగ్ బాస్ సీజన్ 5 లో కంటెస్టెంట్ గా వెళ్ళాడు రవి. ఇదిలా ఉంటే రవి ఇప్పుడు పోలీసులను అశ్రయించినట్టు తెలుస్తుంది. తన పై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారి పై చర్యలు తీసుకోవాలని యాంకర్ రవి పోలీసులను కోరినట్టు తెలుస్తుంది. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి తనపై మరియు తన కుటుంబ సభ్యులపై కొందరు చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశాడట రవి.
తన పైనే కాకుండా తన కుటుంబ సభ్యుల పై కొందరు అసభ్యకర కామెంట్స్ చేస్తున్నారని రవి పోలీసులను అశ్రయించినట్టు తెలుస్తుంది. తన పై ఎన్ని రకాల కామెంట్స్ చేసిన పట్టించుకోని రవి.. తన కుటుంబసభ్యుల గురించి అసభ్యకరంగా కామెంట్స్ చేయడం పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోషల్ మీడియాలో తనను ఉద్దేశించి చేసిన ప్రతి బ్యాడ్ కామెంట్ కు సమాధానం చెప్పాల్సిందే అని రవి అంటున్నారు. ఇక బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొన్న రవి అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశాడు. రవి బయటకు రావడం పై ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంతకాలం కుటుంబంతో కలిసి హాలిడేకి వెళ్లిన రవి ఇటీవలే తిరిగి వచ్చాడని తెలుస్తుంది. ఇక యాంకర్ రవి పోలీసులను ఆశ్రయించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
మరిన్ని ఇక్కడ చదవండి :