Tanikella Bharani : ఆ సినిమాలో కథ ఉందా అని అడిగా.. కట్ చేస్తే.. థియేటర్లను షేక్ చేసిన మూవీ అది..

దశాబ్దాలుగా సినీ ప్రపంచంలో తనదైన నటనతో.. విలక్షణ పాత్రలతో మెప్పించారు నటుడు తనికెళ్ల భరణి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తాను ఒక చిత్రంలో కథ లేదని దర్శకుడిని ప్రశ్నించినట్లు గుర్తు చేసుకున్నారు. అయితే కథ లేకున్నా "విజువల్ నరేషన్"తో కొత్తదనాన్ని కోరుకున్నానని అతడు తనకు సమాధానం ఇచ్చాడని అన్నారు.

Tanikella Bharani : ఆ సినిమాలో కథ ఉందా అని అడిగా.. కట్ చేస్తే.. థియేటర్లను షేక్ చేసిన మూవీ అది..
Tanikella Bharani

Updated on: Oct 14, 2026 | 3:28 PM

తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయిన శివ చిత్రం గురించి ప్రముఖ నటుడు, రచయిత తణికెళ్ల భరణి చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తాను ఆర్‌జీవీని నేరుగా “శివ”లో కథేముంది అని ప్రశ్నించానని వెల్లడించారు. అందుకు వర్మ ఏ మాత్రం తడుముకోకుండా “ఏమీ లేదు” అని సమాధానం ఇచ్చారని భరణి గుర్తు చేసుకున్నారు. తణికెళ్ల భరణి నిర్వచనం ప్రకారం.. కథ అంటే ఒక పాత్ర తన ప్రస్తుత పరిస్థితి నుండి ఇంకో పరిస్థితికి మారడం. కానీ “శివ” సినిమాలో హీరో కళాశాల విద్యార్థిగా ప్రవేశించి, క్లైమాక్స్ లోనూ అదే విద్యార్థిగా కనిపిస్తాడు. అతని పాత్రలో కానీ, కథాగమనంలో కానీ గుర్తించదగిన మార్పు ఉండదు. ఈ అంశాన్ని భరణి గారు వర్మ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు, “నా సినిమా ఆడుతుందో లేదో తెలియదు కానీ, కొత్త రకమైన సినిమా తీశాననే సంతృప్తి నాకు మిగులుతుంది” అని వర్మ చెప్పారట. ఇది కేవలం ఒక “యాక్షన్ నరేషన్” లేదా “విజువల్ నరేషన్” అని ఆయన అభిప్రాయపడ్డారు.

“శివ” తెలుగు సినిమాలో అంతకు ముందు ఎవరూ ప్రయత్నించని దృశ్య కథనాన్ని పరిచయం చేసింది. ఈ చిత్రంలో మాటలు తక్కువగా, దృశ్యాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి దృశ్యానికీ మరొక దృశ్యానికీ మధ్య తార్కిక సంబంధం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే, సంప్రదాయ కథకు అవసరమైన మూల కారణాలు, పరిణామాలు లోతుగా ఉండవు. ఉదాహరణకు, కథానాయిక హీరోను ప్రేమించడం, హీరో ఆమెకు ఆపదలో సహాయపడటం, విలన్లను ప్రతిఘటించడం వంటివి జరుగుతాయి. కానీ విలన్ల గొడవలు ఏమిటి? వారు హీరోపై ఎందుకు దాడి చేస్తున్నారు? కళాశాల రాజకీయాల వెనుక ఉన్న లోతైన వివరాలు వంటివి పెద్దగా చర్చించబడవు.

ఈ వివరాలు లేకపోయినా, ఈ దృశ్య కథన శైలి ముఖ్యంగా యువతను విపరీతంగా ఆకట్టుకుంది. సైకిల్ చైన్ లాగి హీరో కొట్టే సన్నివేశం, అతని కళ్ళల్లో కనిపించే ఆవేశం అంతకు ముందు ఏ తెలుగు సినిమాలోనూ ఎవరూ చూడని కొత్త అనుభూతినిచ్చాయి. అంతకు ముందు చిత్రాలలో ఆవేశాన్ని పెంచడానికి భావోద్వేగమైన సంభాషణలు, కవితాత్మకమైన డైలాగులను ఉపయోగించేవారు. కానీ “శివ”లో సంభాషణలు లేకుండానే హీరో కళ్ళ ద్వారా ఆవేశాన్ని పలికించడం వర్మ గొప్పదనం. ఈ పాత్రకు నాగార్జున పర్ఫెక్ట్‌గా సరిపోయారని, ఆయన లేకపోతే సినిమా ఇంత గొప్పగా ఉండేది కాదని భరణి గారు అభిప్రాయపడ్డారు.

సినిమా విజయానికి మరో ప్రధాన కారణం ఇళయరాజా అందించిన నేపథ్య సంగీతం. ముఖ్యంగా “టెర్రిఫిక్ సౌండ్”, “పంచ్ సౌండ్” ప్రేక్షకులను విపరీతంగా ప్రభావితం చేశాయి. సాధారణంగా సినిమాల్లో పంచ్ సౌండ్ కోసం కొబ్బరికాయలు కొట్టేవారు. కానీ వర్మ, నిజంగా మనిషికి దెబ్బ తగిలితే, ఎముక విరిగితే, చర్మంపై గాయం అయితే ఎలాంటి శబ్దం వస్తుందో ప్రయోగం చేసి, అదే శబ్దాన్ని ఉపయోగించారు. ఈ వినూత్న శబ్దం, దాని ప్రభావం ప్రేక్షకులను సినిమాతో పూర్తిగా లీనమయ్యేలా చేశాయని తణికెళ్ల భరణి వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Trending Song: యూట్యూబ్ షేక్ చేస్తున్న బతుకమ్మ సాంగ్.. రెండు రోజుల్లోనే 7 లక్షల వ్యూస్.. డీజేలలో మారుమోగిపోతుంది..

Loading...
Unable to load recommendations.
Follow Us