అరవ సినిమా అడ్డం తిరిగిందా..? కోలీవుడ్‌లో కాక రేపుతున్న దళపతి ఫ్యాక్టర్..

తమిళనాడు రాజకీయాల్లో దళపతి విజయ్ విజయంతో కోలీవుడ్‌లో కొత్త చర్చ మొదలైంది. కొందరు సినీ ప్రముఖులు విజయ్‌కు మద్దతుగా నిలుస్తుండగా, మరికొందరు ఆయన ప్రభుత్వ నిర్ణయాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. కమల్ హాసన్, అరుణ్ విజయ్, లారెన్స్ వంటి వారు విజయ్‌కు సపోర్ట్‌గా మాట్లాడుతుండగా, హీరో విశాల్ మాత్రం ప్రభుత్వ వ్యవహారాలపై ప్రశ్నలు లేవనెత్తారు. రజనీకాంత్ వైఖరి కూడా ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.

అరవ సినిమా అడ్డం తిరిగిందా..? కోలీవుడ్‌లో కాక రేపుతున్న దళపతి ఫ్యాక్టర్..
Kollywood Political War

Updated on: May 18, 2026 | 9:51 PM

కోలీవుడ్‌లో నిన్నమొన్నటిదాకా ఓ రచ్చబండ షురూ ఐంది. రెమ్యూనరేషన్ల గొడవలొచ్చి తమిళ హీరోలు, తమిళ నిర్మాతలు రెండు గ్రూపులుగా విడిపోయారు. లాభాలే కాదు నష్టాలు కూడా పంచుకోవాల్సిందే అని ప్రొడ్యూసర్లు మారాం చేస్తే ఉన్న పళంగా షూటింగులు బందైపోయి.. ఇండస్ట్రీ మొత్తం సైలెంట్ మోడ్‌లోకి వెళ్లింది. అది మేనెల ఫస్ట్ వీక్‌. సరిగ్గా ఇదే టైమ్‌లో, ఇంకో కార్నర్‌ నుంచి పెద్ద బ్రేకింగ్ న్యూస్. ఒక సినిమా హీరో ముఖ్యమంత్రి కుర్చీనెక్కారని. మావోడు డైరెక్టుగా సీఎమ్మే అయ్యాడు.. ఇంకేముంది.. ప్రతిరోజూ పండగే అనుకుంది తమిళ పరిశ్రమ. కానీ, ఇల్లగ్గానే పండగైపోలేదక్కడ. విజయ్ విక్టరీ కొట్టాడో లేదో పరిశ్రమలో ఒక్కసారిగా అదోరకం నిశ్శబ్దం. కొద్దికొద్దిగా ఆ నిశ్శబ్దం బద్దలౌతోందా? తమిళ రాజకీయాల్లో వచ్చిన పెనుమార్పు తమిళ సినిమాను ఎటువైపు తీసుకెళ్తున్నట్టు? కొత్త బాధ్యతలు తీసుకున్న సోదరుడు విజయ్‌ గారిని స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశా… ఆయన ఆతిథ్యం అద్భుతం.. ఆయన ఆలోచనలు అంతకంటే అద్భుతం.. ఆయన చూపిన ఆప్యాయతకు ఉబ్బితబ్బిబ్బైపోయా.. అంటూ తన్మయత్వంతో ఊగిపోతూ ట్వీట్ చేశారు లోకనాయకుడు కమల్‌హాసన్. ఇదే కమల్‌హాసన్ ఎన్నికలకు ముందు విజయ్ పార్టీకి అటువైపు నిలబడ్డ కథానాయకుడేగా? డీఎంకేతో కలిసి విజయ్ గెలుపును ప్రత్యక్షంగా అడ్డుకోబోయిన బాపతేగా? ఎన్నికల తర్వాత కథ...

Loading...
Unable to load recommendations.
Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి