శ్రుతీ వెళ్లిపోయింది.. ఫ్రెండ్‌ లైన్‌లోకి వస్తుందా..!

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌ నటిస్తోన్న వకీల్‌ సాబ్‌ నుంచి శ్రుతీ హాసన్ తప్పుకున్నట్లు ఆ మధ్యన వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.

శ్రుతీ వెళ్లిపోయింది.. ఫ్రెండ్‌ లైన్‌లోకి వస్తుందా..!

Updated on: Jul 02, 2020 | 5:16 PM

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌ నటిస్తోన్న వకీల్‌ సాబ్‌ నుంచి శ్రుతీ హాసన్ తప్పుకున్నట్లు ఆ మధ్యన వార్తలు వినిపించాయి. కారణాలు తెలీవు గానీ ఈ ప్రాజెక్ట్‌ చేయలేనని శ్రుతీ మేకర్లకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దర్శకనిర్మాతలు మరో హీరోయిన్‌ కోసం వేట ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తమన్నా పేరు లైన్‌లోకి వచ్చినట్లు టాక్‌ నడుస్తోంది. ఈ మేరకు త్వరలోనే దిల్ రాజు, తమన్నాను సంప్రదించబోతున్నట్లు సమాచారం. ఒకవేళ తమన్నా ఒప్పుకుంటే.. పవన్‌తో రెండోసారి రొమాన్స్‌ చేసే అవకాశం మిల్కీబ్యూటీకి వస్తుంది. అంతేకాదు ఇంతవరకు పవన్‌ సరసన రేణు, శ్రుతీ మాత్రమే రెండుసార్లు నటించగా.. ఆ లిస్ట్‌లో తమన్నా కూడా చేరుతుంది. కాగా శ్రుతీ, తమన్నా మంచి స్నేహితులన్న విషయం అందరికీ తెలిసిందే.

కాగా హిందీలో ఘన విజయం సాధించిన పింక్‌ రీమేక్‌గా వకీల్‌ సాబ్‌ తెరకెక్కనుంది. ఇందులో పవన్ లాయర్‌గా కనిపించనుండగా.. అంజలి, నివేథా థామస్, అనన్య, ప్రకాష్‌ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. బోని కపూర్‌, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీపై పవన్ ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us