
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వందో సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. డైరెక్టర్ రా. కార్తీక్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి తాత్కాలికంగా ‘కింగ్ 100’ (King 100) అనే వర్కింగ్ టైటిల్‌ను ఖరారు చేశారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై ఈ సినిమా అత్యంత గ్రాండ్‌గా తెరకెక్కుతోంది. కాగా ఈ చిత్రంలో ప్రముఖ నటి టబు ఒక కీలక పాత్రలో నటిస్తుండగా, ఆమెకు సంబంధించిన స్పెషల్ అప్డేట్ రిలీజ్ చేశారు మేకర్స్. తాజాగా ఈ గ్లింప్స్ సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. మంగళవారం నాడు నటి టబు పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఈ సినిమా నుంచి ఆమె పాత్రకు సంబంధించిన ప్రత్యేక గ్లింప్స్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ గ్లింప్స్‌లో టబు లుక్, ఆమె చెప్పిన పవర్ఫుల్ డైలాగ్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా తారాస్థాయికి చేర్చింది. గ్లింప్స్‌లో భాగంగా టబు చెప్పిన, ”మనుషుల్లో రెండు రకాలు.. కష్టాన్ని నమ్మేవాళ్లు, అదృష్టాన్ని నమ్మేవాళ్లు. మహంతి ఝాన్సీ రాణి అనే నేను..” అనే డైలాగ్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : 90% హిట్లు ముందే ఊహిస్తా.. కానీ ఎన్టీఆర్ సినిమాల విషయంలో సీన్ రివర్స్ అయింది.. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్
ఈ చిత్రంలో టబు పాత్ర ఎంతో పవర్‌ఫుల్‌గా, వైవిధ్యమైన షేడ్స్‌తో ఉండబోతున్నట్లు ఈ గ్లింప్స్ స్పష్టం చేస్తోంది. నాగార్జున కెరీర్లోనే ల్యాండ్‌మార్క్ మూవీగా వస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో భారీ తారాగణం నటిస్తోంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ సినిమాను రాబోయే డిసెంబరు 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. నాగ్ కెరీర్ మైలురాయిగా నిలవనున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.
ఎక్కువ మంది చదివినవి : Trending Song : ఏముంటది మావ ఈ సాంగ్.. స్టార్ హీరోహీరోయిన్ లేకపోయినా సెన్సేషనల్ హిట్.. మిలియన్ వ్యూస్‌తో యూట్యూబ్ షేక్..
ఇదిలా ఉంటే.. దాదాపు 27 ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబో రిపీట్ కాబోతుంది. ఒకప్పుడు వీరి జోడికి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉండేది. అప్పట్లో నాగ్, టబు కలిసి నటించిన నిన్నే పెళ్లాడతా, ఆవిడా మా ఆవిడే వంటి చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. అలాగే సిసింద్రీ చిత్రంల టబు స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు చాలా కాలం తర్వాత వీరి కాంబో వస్తుండడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Jayachitra: ఆ హీరో డైలాగ్ చెబితే సింహం గర్జనలా ఉంటుంది.. కానీ సెట్ లో చేసే అల్లరి మాములుగా ఉండదు.. సీనియర్ హీరోయిన్..
ఎక్కువ మంది చదివినవి : VV Vinayak : ఆ హీరోతో సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నా.. ప్రతిసారి మిస్సయ్యింది.. డైరెక్టర్ వివి వినాయక్..