అన్నదాతలకు మద్దతు తెలిపిన బాలీవుడ్ నటి.. స్వయంగా రైతుల ఆందోళనలో పాల్గొన్న స్వరభాస్కర్

కేంద్రప్రభుత్వం రూపొందించిన  వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ.. రైతులు రోడ్డెక్కిన విషయం తెలిసిందే. 23 రోజులుగా ఢిల్లీ సరిహద్దులోని  సింఘు వద్ద సుమారు లక్షన్నర మంది అన్నదాతలు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు.

అన్నదాతలకు మద్దతు తెలిపిన బాలీవుడ్ నటి.. స్వయంగా రైతుల ఆందోళనలో పాల్గొన్న స్వరభాస్కర్

Updated on: Dec 19, 2020 | 8:01 AM

కేంద్రప్రభుత్వం రూపొందించిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ.. రైతులు రోడ్డెక్కిన విషయం తెలిసిందే. 23 రోజులుగా ఢిల్లీ సరిహద్దులోని  సింఘు వద్ద సుమారు లక్షన్నర మంది అన్నదాతలు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన చట్టాలను వెంటనే రద్దుచేయాలని రైతుసంఘాల డిమాండ్ చేస్తున్నాయి. రైతులకు పలువురు విపక్ష నేతలు, పలువురు ప్రముఖులు, బాలీవుడ్ నటులు, క్రీడాకారులు మద్దతు తెలుపుతున్నారు. తాజాగా బాలీవుడ్ నటి స్వరభాస్కర్ అన్నదాతలకు మద్దతు తెలుపారు. గురువారం స్వయంగా ఆమె రైతుల నిరసనలో పాల్గొన్నారు. గతకొంతకాలంగా రైతులకు మద్దతుగా సోషల్ మీడియాలో స్వరభాస్కర్ పోస్ట్లు పెడుతున్న విషయం తెలిసిందే. ఇక స్వరభాస్కర్ కంటే ముందు నటుడు దిల్జీత్ దోసాంజ్, క్రికెటర్ మన్ దీప్ సింగ్ లు అన్నదాతలకు సంఘీభావంగా ఆందోళనల్లో పాల్గొన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us