ఆ సినిమా విడుదల తరువాత 50 నంబర్లు మార్చిన సుశాంత్..!

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తరువాత ఆయనకు సంబంధించిన పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఆ సినిమా విడుదల తరువాత 50 నంబర్లు మార్చిన సుశాంత్..!

Updated on: Jun 21, 2020 | 3:38 PM

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తరువాత ఆయనకు సంబంధించిన పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా సుశాంత్ గురించి ప్రముఖ దర్శకుడు అభిషేక్‌ కపూర్ ఓ విషయాన్ని వెల్లడించారు. ఒకానొక సమయంలో సుశాంత్ 50 నంబర్లు మార్చారని ఆయన చెప్పుకొచ్చారు. సుశాంత్ హీరోగా పరిచయం అయిన ‘కాయ్ పో చే’కు దర్శకత్వం వహించిన అభిషేక్ కపూర్.. అతడితోనే ‘కేదారినాథ్’‌ను తెరకెక్కించిన విషయం తెలిసిందే.

ఇక ఈ సినిమా విడుదల తరువాత సుశాంత్ 50 నంబర్లను మార్చారట. ”మీడియా అతడిని పక్కకు తోసింది. అప్పుడు(కేదారినాథ్ విడుదల సమయంలో) అందరూ సారా అలీఖాన్‌ గురించే చెప్పేవారు. దాంతో సుశాంత్ చాలా ఇబ్బంది పడ్డాడు. నాతో కూడా సుశాంత్ మాట్లాడలేదు. ఏదో పోగొట్టుకున్నట్లు అయిపోయాడు” అని అభిషేక్‌ చెప్పుకొచ్చారు. కాగా బాలీవుడ్‌లోని నెపోజిటం(బంధు ప్రీతి) వల్లనే సుశాంత్ బలవన్మరణం చేసుకున్నాడని, ఆయనకు న్యాయం చేయాలంటూ సుశాంత్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.

Read This Story Also: ప్రభాస్‌ కోసం రంగంలోకి దిగిన విజయ్‌ సంగీత దర్శకుడు..!

Loading...
Unable to load recommendations.
Follow Us