సుశాంత్‌సింగ్‌ మేనేజర్‌ దిశా మృతి కేసులో సంచలన ట్విస్ట్.. సాక్ష్యాలను తారుమారు చేసినట్టు..

దిశా సాలియన్‌ మృతి కేసులో దాదాపు ఆరేళ్ల తర్వాత కీలక పరిణామం చోటుచేసుకుంది. బాంబే హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఎఫ్‌ఐఆర్‌లో ఉద్దవ్‌ ఠాక్రే, ఆదిత్య ఠాక్రేతో పాటు పలువురు పోలీసు అధికారులు, బాలీవుడ్‌ ప్రముఖుల పేర్లు ఉన్నట్లు కథనం పేర్కొంది. దిశా తండ్రి చేసిన ఆరోపణలు, 2020లో జరిగిన పరిణామాలు, కేసులో ప్రస్తావనకు వచ్చిన వ్యక్తుల పాత్రపై సీబీఐ దర్యాప్తు చేయనుంది.

సుశాంత్‌సింగ్‌ మేనేజర్‌ దిశా మృతి కేసులో సంచలన ట్విస్ట్.. సాక్ష్యాలను తారుమారు చేసినట్టు..
Disha Salian Death Case

Edited By:

Updated on: Sep 14, 2026 | 4:16 PM

దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ మాజీ మేనేజర్‌ దిశా సాలియాన్‌ మృతి కేసు కొత్త మలుపు తిరిగింది. బాంబే హైకోర్టు ఆదేశాలతో దిశా సాలియన్ మరణంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఎఫ్‌ఐఆర్‌ (FIR)లో మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్‌ ఠాక్రే , ఆయన కుమారుడు ఆదిత్యా ఠాక్రేతో పాటు పోలీసు అధికారులు, బాలీవుడ్‌ నటులు దినో మోరియా , సూరజ్‌ పంచోలి, రియా చక్రవర్తి పేర్లను చేర్చడం సంచలనంగా మారింది.. సాక్ష్యాలను తారుమారు చేసినట్టు ఉద్దవ్‌,ఆదిత్యా ఠాక్రేపై FIR నమోదు చేయడం సంచలనం రేపింది. రేప్‌ అండ్‌ మర్డర్‌ కేసు కింద FIR నమోదు చేశారు.

అయితే, 2020 జూన్ 8న ముంబైలోని మలాడ్ ప్రాంతంలో ఓ నివాస భవనం 12వ అంతస్తు నుంచి పడి దిశా సాలియన్ మృతి చెందారు. ఆమె మరణం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. దిశా మరణించిన ఆరు రోజులకే.. 2020 జూన్ 14న నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన అపార్ట్‌మెంట్‌లో మృతిచెందారు. దీంతో ఈ రెండు మరణాల మధ్య ఏదైనా సంబంధం ఉందా..? అనే అనుమానాలు, ఊహాగానాలు అప్పట్లో తీవ్రంగా చర్చకు దారితీశాయి.

అయితే.. తన కూతురిని అత్యాచారం చేసి చంపేశారని దిశా సాలియాన్‌ తండ్రి సతీష్‌ సాలియాన్‌ పదేపదే ఆరోపిస్తున్నారు. సతీష్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు.. దిశా సాలియన్ మరణంపై దర్యాప్తు చేయాలని సెప్టెంబర్ 2న సీబీఐని ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తు కోసం అనుభవజ్ఞుడైన సీనియర్ అధికారిని నియమించాలని కూడా కోర్టు సూచించింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో సీబీఐ తాజాగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించింది.

దాదాపు ఆరేళ్లుగా కొనసాగుతున్న ఈ కేసులో ఇప్పుడు సీబీఐ ఎంట్రీ ఇవ్వడంతో దర్యాప్తు ఏ దిశగా సాగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. దిశా సాలియన్ మరణానికి దారితీసిన పరిస్థితులు, అప్పట్లో జరిగిన పరిణామాలు, కేసులో ప్రస్తావనకు వచ్చిన వ్యక్తుల పాత్ర తదితర అంశాలపై సీబీఐ దర్యాప్తు చేయనుంది. అయితే ఎఫ్‌ఐఆర్‌లో ప్రముఖుల పేర్లు ఉండటం తీవ్రదుమారం రేపింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us