నవంబర్‌లో పెళ్లి చేసుకోవాలనుకున్న సుశాంత్.. కీలక విషయాలు బయటపెట్టిన కజిన్

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం దేశవ్యాప్తంగా పలువురిని శోకసంద్రంలోకి నెట్టింది. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలుగొందుతున్న ఈ నటుడు

నవంబర్‌లో పెళ్లి చేసుకోవాలనుకున్న సుశాంత్.. కీలక విషయాలు బయటపెట్టిన కజిన్
Follow us

| Edited By:

Updated on: Jun 15, 2020 | 2:32 PM

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం దేశవ్యాప్తంగా పలువురిని శోకసంద్రంలోకి నెట్టింది. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలుగొందుతున్న ఈ నటుడు ఆత్మహత్య చేసుకొని అర్ధాంతరంగా కన్నుమూయడంపై పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మంచి భవిష్యత్ ఉన్న ఈ నటుడు ఇలా చేయకుండా ఉండాల్సిందంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా సుశాంత్‌ వివాహంపై ఆయన కజిన్‌ కీలక విషయాలు బయటపెట్టారు.

నవంబర్‌లో సుశాంత్ పెళ్లి చేయాలనుకున్నామని ఆయన అన్నారు. సుశాంత్‌కి పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ప్రారంభమయ్యాయని ఆయన అన్నారు. పెళ్లి పనులకు సంబంధించి త్వరలోనే కుటుంబసభ్యులు ముంబయికి వెళ్లాలనుకున్నారని సుశాంత్‌ కజిన్ రివీల్ చేశారు. అంతేకాదు కేవలం ఇరు వర్గాల కుటుంబ సభ్యుల సమక్షంలోనే సుశాంత్ పెళ్లి చేయాలనుకున్నామని ఆయన పేర్కొన్నారు. అయితే సుశాంత్‌ చేసుకోబోయే అమ్మాయి పేరును మాత్రం ఆయన బయటకి చెప్పలేదు. కాగా బుల్లితెరపై వెలుగొందుతున్న సమయంలో సుశాంత్ తన తోటి నటి అంకిత్ లోఖ్వాండేను ప్రేమించారు. దాదాపు 6 సంవత్సరాల తరువాత వీరిద్దరు 2016లో విడిపోయారు. ఆ తరువాత నటి కృతి సనన్‌, సుశాంత్ ప్రేమించుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని వారిద్దరు బయటకు ప్రకటించకపోయినా.. ఈ ఇద్దరు బయట కనిపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కారణాల తెలీదు గానీ వీరిద్దరు విడిపోయారు. ఇక ఈ మధ్య కాలంలో నటి రియా చక్రవర్తితో సుశాంత్ ప్రేమలో ఉన్నట్లు బాలీవుడ్‌ వర్గాల్లో పుకార్లు వినిపించాయి. దానికి తోడు లాక్‌డౌన్ సమయంలో వీరిద్దరు కలిసి వాకింగ్‌కి వెళ్లిన ఫొటోలు బయటకు రావడంతో, ఈ వార్తలకు బలం చేకూరింది.

Read This Story Also: మాస్కు ధరించకపోతే ఇక బాదుడే

Latest Articles
యాంగ్జైటీ ఎటాక్‌ గురించి ఎప్పుడైనా విన్నారా? ఎంత ప్రమాదమో తెలుసా
యాంగ్జైటీ ఎటాక్‌ గురించి ఎప్పుడైనా విన్నారా? ఎంత ప్రమాదమో తెలుసా
అమ్మ బాబోయ్ అరాచకం.! దివి వయ్యారాలు కుర్ర హృదయాలకు హార్ట్ ఎటాక్
అమ్మ బాబోయ్ అరాచకం.! దివి వయ్యారాలు కుర్ర హృదయాలకు హార్ట్ ఎటాక్
ఎట్టకేలకు చిక్కిన సీరియల్ కిల్లర్.. హత్యల లిస్టుతో పోలీసుల షాక్!
ఎట్టకేలకు చిక్కిన సీరియల్ కిల్లర్.. హత్యల లిస్టుతో పోలీసుల షాక్!
ఇంట్లో గడియారాన్ని ఏ దిక్కులో ఉంచితే మంచిదో తెలుసా?
ఇంట్లో గడియారాన్ని ఏ దిక్కులో ఉంచితే మంచిదో తెలుసా?
పైకేమో చూస్తే అదొక టిఫిన్ సెంటర్.. కానీ లోపల జరిగేది తెలిస్తే!
పైకేమో చూస్తే అదొక టిఫిన్ సెంటర్.. కానీ లోపల జరిగేది తెలిస్తే!
T20 ప్రపంచకప్‌ కోసం సూర్య సన్నాహాలు.. మధ్యాహ్నం గ్రౌండ్‌కు వెళ్లి
T20 ప్రపంచకప్‌ కోసం సూర్య సన్నాహాలు.. మధ్యాహ్నం గ్రౌండ్‌కు వెళ్లి
అరే ఏంట్రా ఇది.. యంగ్ హీరో బాడీ మీద ఇలాంటి గేమ్సా.. ?
అరే ఏంట్రా ఇది.. యంగ్ హీరో బాడీ మీద ఇలాంటి గేమ్సా.. ?
'ఇక ప్రతి సోమవారం నలిగిన బట్టలు మాత్రమే ధరించండి..' CSIR హుకూం!
'ఇక ప్రతి సోమవారం నలిగిన బట్టలు మాత్రమే ధరించండి..' CSIR హుకూం!
సమ్మోహనంగా సాగిన సంస్కృత కవి సమ్మేళనం
సమ్మోహనంగా సాగిన సంస్కృత కవి సమ్మేళనం
బ్యాటింగ్‌లో బాహుబలి.. బౌలింగ్‌లో భల్లాలదేవ.. ఈ ప్లేయర్ అరవీర.!
బ్యాటింగ్‌లో బాహుబలి.. బౌలింగ్‌లో భల్లాలదేవ.. ఈ ప్లేయర్ అరవీర.!