Anil Kumar

నాలాంటి వారిని వదులుకోవద్దు.. సమంత పోస్ట్ నాగచైతన్యను ఉద్దేశించేనా.?

07 May 2024

సమంత.. ఈ పేరు తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు.. సినిమాల్లో స్పీడ్ తగ్గించిన సామ్ నెట్టింట బాగా వైరల్ అవుతుంది.

సమంత మయోసైటిస్‌ తో బాధపడుతూ కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.. ఈ మధ్యే కోలుకుంటుంది.

ఈ అమ్మడు త్వరలోనే మా ఇంటి బంగారం సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు. సామ్ నిర్మిస్తున్న మొదటి సినిమా ఇది.

అయితే సినిమాల పరంగా సామ్ అలికిడి తగ్గినప్పటికీ ఆమె సోషల్‌ మీడియా పోస్టులు మాత్రం వైరల్‌ అవుతున్నాయి.

ఇంకా చెప్పాలంటే సామ్ షేర్ చేసే ఫొటోస్ మాత్రం నెట్టింట నెక్స్ట్ లెవల్లో ట్రెండ్ అవుతున్నాయి అనే చెప్పాలి.

అక్కినేని నాగచైతన్య తో విడిపోయిన తరువాత సమంత గ్లామర్ షో మరింత పెరిగింది అంటూ పలు కామెంట్స్ లేకపోలేదు.

ఇక తాజాగా మరోసారి సామ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.. తనలాంటి వృషభరాశి వారు ఎప్పుడూ వెనకడుగు వేయరని,

అలాంటివారిని కోల్పోవద్దంటూ పోస్ట్ చేశారు సామ్‌.ఈ పోస్ట్‌ను ఎవరినో ఉద్దేశించే సామ్ పెట్టారనే కామెంట్స్ పెరిగిపోయాయి.