
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి చిత్రం ‘దిల్ బెచారా’ రిలీజ్‌కు డేట్ ఫిక్స్ అయ్యింది. వచ్చే నెల 24న దిల్ బెచారాను విడుదల చేయబోతున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్ని విడుదల చేసింది. ప్రముఖ ఆన్లైన్ ఫ్లాట్‌ఫామ్ ‘డిస్నీ+హాట్ స్టార్’లో ఈ సినిమా ప్రీమియర్ అవ్వబోతోంది. ఇక ఈ సినిమాను హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ చేసుకున్న వాళ్లతో పాటు చేసుకోని వాళ్లు కూడా ఫ్రీగా చూడొచ్చని ఆ సంస్థ తెలిపింది.
కాగా హాలీవుడ్ చిత్రం ‘ద ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ రీమేక్‌గా ‘దిల్ బేచారా’ తెరకెక్కింది. ముఖేష్ చబ్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుశాంత్ సరసన సంజనా సంఘి నటించింది. సైఫ్ అలీ ఖాన్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
కాగా ఇప్పటికే ఈ సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడుతూ రావడం, కరోనా నేపథ్యంలో థియేటర్లు ఇప్పుడిప్పుడే తెరుచుకునే అవకాశం లేకపోవడంతో ఈ మూవీని ఆన్లైన్లో రిలీజ్ చేసేందుకు దర్శకనిర్మాతలు సిద్ధమయ్యారు. అయితే ఈ నెల 14న సుశాంత్ ఆత్మహత్య చేసుకొని మృతి చెందగా.. ఆయన చివరి సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో డిమాండ్ చేశారు. వారి డిమాండ్‌కు ఏఆర్ రెహమాన్ సైతం తన మద్దతును ప్రకటించిన విషయం తెలిసిందే.
Read This Story Also: రాలేనని చెప్పిన పవన్ కల్యాణ్..!