సుశాంత్ కేసు: కీలక విషయం బయటపెట్టిన లాక్‌స్మిత్‌‌

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మృతి కేసులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా సుశాంత్‌ రూమ్‌ని తెరిచిన లాక్‌స్మీత్ మహ్మద్ రఫీ‌ ఈ ఘటనకు సంబంధించిన కీలక విషయాన్ని బయటపెట్టారు

సుశాంత్ కేసు: కీలక విషయం బయటపెట్టిన లాక్‌స్మిత్‌‌

Updated on: Aug 22, 2020 | 4:51 PM

Sushant case updates: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మృతి కేసులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా సుశాంత్‌ రూమ్‌ని తెరిచిన లాక్‌స్మిత్‌ మహ్మద్ రఫీ‌ ఈ ఘటనకు సంబంధించిన కీలక విషయాన్ని బయటపెట్టారు. సుశాంత్ ఆత్మహత్య రోజు అతడి బెడ్‌ రూమ్‌ని తాను పగలగొట్టానని అతడు వెల్లడించారు. అప్పుడు సుశాంత్ ఇంట్లో నలుగురు వ్యక్తులు ఉన్నారని, వారి మొహంలో ఎలాంటి భయం లేదని  తెలిపారు.

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మహ్మద్ రఫీ.. ”సుశాంత్ చనిపోయిన రోజు గం.1.30ని.ల ప్రాంతంలో నాకు కాల్ వచ్చింది. ఓ గది తాళం పగలగొట్టాలని నాకు కాల్ చేశారు. దీంతో వారు చెప్పిన అడ్రస్‌కి వెళ్లి తాళంని పగలగొట్టాను. ఆ బెడ్ రూమ్ తాళం కంప్యూటరైజ్‌ లాక్‌. దాన్ని పగలగొట్టినందుకు నాకు రూ.2వేలు ఇచ్చారు. లోపల ముగ్గురు నుంచి నలుగురు వ్యక్తులు ఉన్నారు. వారు నన్ను ఏమీ చూడనివ్వలేదు. వారు ఎవరో కూడా నాకు తెలీదు. డోర్ తెరుచుకున్న వెంటనే నాకు డబ్బులిచ్చి, నా సామాన్లు తీసుకొని వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పారు. లోపల మృతదేహం ఉందన్న విషయం నాకు తెలీదు. అప్పుడు వారి మొహంలో ఎలాంటి ఆందోళన, భయం కనిపించలేదు. ఆ తరువాత గంటకు పోలీసులు నాకు మళ్లీ ఫోన్ చేసి రమ్మన్నారు. అప్పుడు నాకు తెలిసింది అది సుశాంత్‌ ఇల్లు అని” అని తెలిపారు. అయితే ఆ సమయంలో సుశాంత్ ఇంట్లో ఎవరు ఉన్నారన్న చర్చ ప్రస్తుతం బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉంటే మరోవైపు ఈ కేసును దర్యాప్తుకు తీసుకున్న సీబీఐ.. పలువురిని విచారిస్తోన్న విషయం తెలిసిందే.

Read More:

ప్రణబ్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆర్మీ ఆసుపత్రి ప్రకటన

రీషూట్ చేయాలనుకుంటోన్న బెల్లంకొండ టీమ్‌

 

Loading...
Unable to load recommendations.
Follow Us