
థియేటర్లలో ఘన విజయం సాధించి కమర్షియల్ హిట్‌గా నిలిచిన తమిళ చిత్రం ‘మండాడి’. ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లోనూ సరికొత్త సంచలనాలు సృష్టిస్తోంది. డిజిటల్ స్క్రీన్‌పై వ్యూయర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటూ గ్లోబల్ స్థాయిలో దూసుకుపోతోంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా సాధిస్తున్న రికార్డులు ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఈ చిత్రాన్ని ఎగబడి చూస్తున్నారు. అక్టోబర్ 12 నుంచి 18వ తేదీ వరకు సంబంధించిన గ్లోబల్ టాప్ చార్ట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ తాజాగా విడుదల చేసింది. నాన్-ఇంగ్లీష్ సినిమాల కేటగిరీలో ‘మండాడి’ చిత్రం ఏకంగా ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానాన్ని దక్కించుకుని అరుదైన రికార్డు సృష్టించింది. కేవలం ఒక వారంలోనే ఈ చిత్రానికి ఏకంగా 22 లక్షలకు పైగా వ్యూస్ రావడం విశేషం.
ఎక్కువ మంది చదివినవి : Nartanasala Movie: బృహన్నలగా ఎన్టీఆర్ విశ్వరూపం.. నర్తనశాల వెనుక ఉన్న ఈ అరుదైన నిజాలు తెలుసా.. ?
నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ ట్రెండింగ్ టాప్ 10 నాన్-ఇంగ్లీష్ సినిమాల జాబితాలో భారతదేశం నుంచి చోటు దక్కించుకున్న ఏకైక సౌత్ ఇండియన్ సినిమా ఇదే కావడం గమనార్హం. పడవ పందాలు అనే డిఫరెంట్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాకు ఆడియన్స్ నుంచి విపరీతమైన స్పందన లభిస్తోంది. కమెడియన్ నుంచి హీరోగా మారిన సూరి తనదైన సహజ నటనతో అదరగొట్టగా, టాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ సుహాస్ ఈ చిత్రంలో కీలకమైన విలన్ పాత్రలో నటించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాగే సీనియర్ నటుడు సత్యరాజ్, మహిమ నంబియార్ తదితరులు తమ నటనతో సినిమా స్థాయిని మరింత పెంచారు.
ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే చాలు జీవితం మారిపోతుంది.. డబ్బు సంపాదనకు మురళీ మోహన్ ఇచ్చిన సలహాలు..
దర్శకుడు మతిమారన్ పుగజేంది ఈ చిత్రాన్ని అత్యంత సహజంగా, ఎమోషనల్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కించారు. ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ బ్యానర్‌పై ఎల్రెడ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీలోనూ అదే జోరును కొనసాగిస్తూ, ఫ్యామిలీ అండ్ యాక్షన్ మూవీ లవర్స్‌కు ‘మండాడి’ ఒక పర్ఫెక్ట్ వాచ్‌గా నిలిచింది.
ఎక్కువ మంది చదివినవి : Trending Song: యూట్యూబ్ షేక్ చేస్తున్న బతుకమ్మ సాంగ్.. రెండు రోజుల్లోనే 7 లక్షల వ్యూస్.. డీజేలలో మారుమోగిపోతుంది..
ఎక్కువ మంది చదివినవి : Cinema : ఇదేం సినిమా రా నాయనా.. సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చి దుమ్ములేపుతున్న మూవీ.. ట్రెండింగ్ నంబర్ 1గా రచ్చ రచ్చ..