Bigg Boss Sohel : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిసిన సోహెల్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో

|

Jan 05, 2021 | 2:23 PM

బిగ్ బాస్ సీజన్ 4 ప్రేక్షకులను బాగానే అలరించింది. నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన ఈ సీజన్ మిగిలిన సీజన్స్ కన్నా ఎక్కువ రేటింగ్ ..

Bigg Boss Sohel : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిసిన సోహెల్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో
Follow us on

Bigg Boss Sohel : బిగ్ బాస్ సీజన్ 4 ప్రేక్షకులను బాగానే అలరించింది. నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన ఈ సీజన్ మిగిలిన సీజన్స్ కన్నా ఎక్కువ రేటింగ్ తో సంచలనం సృష్టించింది. ఇక బిగ్ బాస్  టాప్ 3 లోనిలిచిన కంటెస్టెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. ముఖ్యంగా ఎక్కడ చూసిన సోహెల్ సందడి కనిపిస్తుంది. ఇప్పటికే ఈ సింగరేణి ముద్దు బిడ్డ ఓ సినిమాలో హీరోగా కూడా చేస్తున్నాడు. ఇక తన సినిమాలో మెగాస్టార్ చిన్న పాత్రలో కనిపిస్తా అని ప్రామిస్ కూడా చేశారు. అలాగే కామెడీ లెజెండ్ బ్రహ్మానందం కూడా నటిస్తానని మాటిచ్చారు. ఇక హౌస్ లో తనదైన యాటిట్యూడ్ తో భారీగా అభిమానులను సొంతం చేసుకున్నాడు ఈ కుర్రాడు. తాజాగా సోహెల్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసారు. పుష్ప‌గుచ్చం ఇచ్చి న్యూ ఇయ‌ర్ శుభాకాంక్ష‌లు తెలిపారు. క‌విత‌తో క‌లిసి సోహెల్ దిగిన ఫొటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది.

 మరిన్ని ఇక్కడ చూడండి : 

Sourav Ganguly: దాదాను జనవరి 6న డిశ్చార్జ్ చేస్తాం… రెండు, మూడు వారాల తర్వాత మళ్లీ పరీక్షలు.. డాక్టర్ రూపాలీ బసు

House Arrest: మంత్రి సత్యవతి రాథోడ్‌ సహా ప్రజాప్రతినిధులను గృహ నిర్బంధం చేసిన పోలీసులు..!